Ganja Shankar Movie: ‘గంజా శంకర్’ చిత్రయూనిట్‏కు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గాంజా శంకర్'. తాజాగా ఈ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. సినిమాలో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ - 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.

Ganja Shankar Movie: 'గంజా శంకర్' చిత్రయూనిట్‏కు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..
Ganja Shankar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2024 | 11:07 AM

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గాంజా శంకర్’. తాజాగా ఈ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. సినిమాలో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలను ఉంటే వాటిని వెంటనే తొలగించాలని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన విడుదలైన చిన్న గ్లింప్స్ ఆసక్తిని కలిగించింది. విరూపాక్ష సూపర్ హిట్ తర్వాత తేజ్ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.  గతంలో విడుదలైన తేజ్ ప్రీ లుక్ చూస్తే ఇందులో కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెడపై త్రిశూలం, దాని కింద డమరుకం టాటూ కనిపించింది. అలాగే చెవికి పోగు ఉండడంతో ఇందులో తేజ్ గంజాయి అమ్మే యువకుడిగా కనిపించనున్నాడని టాక్ నడిచింది.

ఇదిలా ఉంటే.. గతేడాది రెండు చిత్రాల్లో కనిపించారు తేజ్. అందులో విరూపాక్ష సూపర్ హిట్ అయ్యింది. యాక్సిడెంట్ తర్వాత చాలా కాలానికి ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు తేజ్. ఇందులో సంయుక్త మీనన్ నటించింది. ఇక ఆ తర్వాత తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ