Tollywood: అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన హీరో.. ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా ?..
ప్రస్తుతం ఓ పాత ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీనియర్ నటి గీత పక్కన ఉన్న కుర్రాడిని చూశారా ?. అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. వేలాది మంది అమ్మాయిల హృదయాలను దొచేసిన హీరో. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఈ కుర్రాడు ఒకరు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్. రీల్ హీరోగానే కాదు.. రియల్ హీరో కూడా. ఓవైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అతడు..నిజ జీవితంలో ఎంతో మంది పేదలకు సాయం చేసి వారి గుండెల్లో దైవంగా ఉన్నారు.
సోషల్ మీడియా.. ఇప్పుడు ఎన్నో జ్ఞాపకాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటీనటులకు సంబంధించిన ఆ పాత మధుర జ్ఞాపకాలను ఈతరానికి పరిచయం చేస్తుంది. తారల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే తమ అభిమాన సెలబ్రెటీల పర్సనల్ విషయాలు.. ఒకప్పటి సినీ విశేషాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాత ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీనియర్ నటి గీత పక్కన ఉన్న కుర్రాడిని చూశారా ?. అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. వేలాది మంది అమ్మాయిల హృదయాలను దొచేసిన హీరో. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఈ కుర్రాడు ఒకరు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్. రీల్ హీరోగానే కాదు.. రియల్ హీరో కూడా. ఓవైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అతడు..నిజ జీవితంలో ఎంతో మంది పేదలకు సాయం చేసి వారి గుండెల్లో దైవంగా ఉన్నారు. వందలాది మంది చిన్నారులకు మరో జన్మను ప్రసాదించాడు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని నింపాడు. అతడి దారిలో తన కూతురు, కుమారుడు కూడా వెళ్తున్నారు. ఇంతకీ గుర్తుకు వచ్చిందా ఆ కుర్రాడు ఎవరో ?. మీరు అనుకున్నది నిజమే.. అతడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఆయనను అభిమానులు సూపర్ స్టార్ అని.. ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పైన కనిపిస్తున్న ఫోటో 1990లో విడుదలైన బాల చంద్రుడు చిత్రంలోనిది. ఈ మూవీని మహేష్ తండ్రి కృష్ణ నిర్మించారు. మహేష్ తన నాలుగేళ్ల వయసులో నీడ (1979)లో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. బాలనటుడిగా ఎనిమిది చిత్రాల్లో నటించారు.1999లో, కె. అతను రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన రాజకుమారుడు అనే రొమాంటిక్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో ప్రీతి జింటా కథానాయికగా నటించింది. ఆ తర్వాత మురారి (2001), యాక్షన్ చిత్రం ఒక్కడు (2003), అర్జున్ (2004), అతడు (2005), పోకిరి (2006), దూకుడు (2011), బిజినెస్ మెన్ (2012), సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు (2013), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020), సర్కార్ వారి పాట (2022) వంటి పలు హిట్ చిత్రాలలో ఆయన నటించారు.
ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల నటించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో మహేష్ ఒకరు. సినిమాలే కాకుండా సొంతంగా మహేష్ బాబు ఘట్టమనేని ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని కొనసాగిస్తున్నారు. అలాగే Heal A Child ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. 2005లో హీరోయిన్ నమ్రతను వివాహం చేసుకున్నారు. వీరికి బాబు గౌతమ్, పాప సితార ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.