AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanti: పాక్‌తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ట్వీట్.. నెట్టింట విమర్శలు

భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ వరుసగా దాడులు చేస్తోంది. దేశంలోని పార్టీలన్ని.. ఆపరేషన్ సిందూర్‌ని స్వాగతిస్తూ.. భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే పలువరు సినీ, క్రీడా ప్రముఖులు భారత సైన్యానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

Vijayashanti: పాక్‌తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ట్వీట్.. నెట్టింట విమర్శలు
Vijayashanti
Basha Shek
|

Updated on: May 09, 2025 | 3:09 PM

Share

పహల్ గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను అన్నీ పార్టీలు స్వాగతించాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భారత ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. తెలంగాణలో కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొని పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో తప్పొప్పులు పక్కన పెడితే.. చాలా మంది నెటిజన్లు విజయ శాంతి ట్వీట్ ను తప్పుపడుతున్నారు.

‘భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం. అయితే కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను. హరహర మహాదేవ్, జైహింద్, జై జవాన్.. మీ విజయశాంతి’ అని ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చారు విజయ శాంతి.

ఇవి కూడా చదవండి

విజయశాంతి ట్వీట్..

ప్రస్తుతం విజయశాంతి ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు అవసరమా? దీంతో దేశ భ‌ద్ర‌త‌ విష‌యంలో రాజ‌కీయాలు ఏంట‌ని? విజ‌య శాంతిపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలో కీలక పాత్ర పోషించారు విజయశాంతి. ఇందులో కల్యాణ్ రామ్ హీరోగా నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.