Beast Movie: అభిమానులకు గుడ్‌న్యూస్ అందించిన బీస్ట్ చిత్రయూనిట్.. విజయ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
తమిళ్ స్టార్ హీరో విజయ్‌కు (Vijay) తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్‌లోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్‌కు (Vijay) తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్‌లోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బీస్ట్ (Beast). డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు బీస్ట్ మేకర్స్.
ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్‌కు సంబంధించిన లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ గన్ చేతపట్టుకుని సీరియస్ లుక్‌లో అదరగొట్టారు. అయితే దక్షిణాది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు విజయ్ నటించిన బీస్ట్ సినిమా.. కేజీఎఫ్ సినిమా ఒక రోజు వ్యవధిలో విడుదల కాబోతుండడంతో ఫ్యాన్స్ మధ్య మరింత క్యూరియాసిటి ఏర్పడింది. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించనుంది అనేది చూడాలి. బీస్ట్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
#BeastFromApril13@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #Beast pic.twitter.com/htH6dTPX2q
— Sun Pictures (@sunpictures) March 22, 2022
Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయంటూ..
Nagababu: నిహారిక ఇన్‌స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..
Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..