Kalaavathi Song: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కళావతి సాంగ్.. తెలుగులో మొదటిసారి అలా ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్

Kalaavathi Song: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కళావతి సాంగ్.. తెలుగులో మొదటిసారి అలా ..
Kalaavathi Song
Rajitha Chanti

|

Mar 22, 2022 | 7:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‏ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత అంచనాలను పెంచాయి. ఇందులో మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించబోతుండడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోతుంది. కళావతి పాటలో ప్రేమ, చ‌క్క‌టి భావోద్వేగం క‌లిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోత‌ల‌ హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్‌ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్‌‏లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. తెలుగులో ఫాస్టెస్ట్‏గా మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే మైలురాయిని చేరుకున్న మొదటి సింగిల్‌గా నిల‌వ‌డం విశేషం.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అద్భుతమైన ఆర్కెస్ట్రా తో చ‌క్క‌టి ఫీల్‌ను క‌లిగించేలా బాణీలు స‌మ‌కూర్చాడు. సిద్ శ్రీరామ్ తన మ‌ధుర‌మైన‌ గానంతో పాట‌కు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం స‌మ‌కూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆక‌ట్టుకునే హావ‌భావాల‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన‌ రెండవ సింగిల్ `పెన్నీ` కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సితార ఘట్టమనేని నటించిన ఈ పాట వైరల్‌గా మారింది. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు. మొదటి రెండు పాటలు విజయం సాధించడంతో సినిమా తదుపరి పాటలపై ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న వేసవి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు  మారిపోతుంటాయంటూ..

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu