NTR : ఎన్టీఆర్‌తో సినిమా చేస్తా.. స్టోరీ కూడా రెడీ.. క్లారిటీ ఇచ్చిన వెట్రిమారన్
పాన్ ఇండియా సినిమా కావడంతో అని ప్రాంతాల్లో దేవర సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అండ్ మూవీ టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో దేవర మూవీ టీమ్ ప్రస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అని ప్రాంతాల్లో దేవర సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అండ్ మూవీ టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో దేవర మూవీ టీమ్ ప్రస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. దేవర సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు.
ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?
దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా ఓయ్ అంచనాలను భారీగా పెంచేసింది. సెప్టెంబర్ 27న దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో తారక్ మాట్లాడుతూ.. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉందని.. ఒక్క సినిమా నాతో తమిళ్ లో చేయండి దాన్ని తెలుగులోకి డబ్ చేద్దాం అని అన్నారు.
ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
దీని పై వెట్రి మారన్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మేము ఇంతకు ముందు కలిశాం. సినిమా కథ ఆలోచన ఉంది. మేము దీని గురించి మాట్లాడుకున్నాం కూడా.. మా ఇద్దరికీ ఇప్పుడున్న పని పూర్తయిన తర్వాత తప్పకుండా కలిసి పని చేస్తాం. స్టోరీ కూడా రెడీగానే ఉంది’’ అని వెట్రిమారన్ అన్నారు. త్వరలోనే ఎన్టీఆర్ తో వర్క్ చేయాలనీ అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు వెట్రి మారన్. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా దేవర సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తోంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.