AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డు వ్యవహారం తెలియగానే భక్తుడిగా తల్లడిల్లిపోయాను.. ఇది మహా పాపమన్న మోహన్ బాబు

ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, పండితులతో టీటీడీ ఈవో శ్యామల రావు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. రెండు తెలుగు రాష్ట్రాలను లడ్డు వివాదం అవాక్ అయ్యేలా చేస్తుంది.

లడ్డు వ్యవహారం తెలియగానే భక్తుడిగా తల్లడిల్లిపోయాను.. ఇది మహా పాపమన్న మోహన్ బాబు
Mohan Babu
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2024 | 6:36 PM

Share

పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీఅయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, పండితులతో టీటీడీ ఈవో శ్యామల రావు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. రెండు తెలుగు రాష్ట్రాలను లడ్డు వివాదం అవాక్ అయ్యేలా చేస్తుంది. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతుంది. చాలా మంది ఈ లడ్డు  వ్యవహారం పై స్పందిస్తున్నారు. ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా లడ్డు వ్యవహారం పై మాట్లాడుతున్నారు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇటీవలే నటి ప్రణీత సుభాష్ లడ్డు వివాదం పై మాట్లాడింది. లడ్డులో జంతువుల కొవ్వు కలపడం అనేది దారుణం. ఇందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షంచాలని ఆమె కోరారు. అలాగే ఇది వెంకటేశ్వరస్వామి భక్తులను షాక్ కు గురిచేసిందని ఆమె అన్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు కూడా లడ్డు వివాదం పై స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో ఇలా జరగడం ఘోరం,అతినీచం, పాపమని, ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు పూజిస్తారు. శ్రీవారికి నిత్యం సమర్పించే పవిత్రమైన లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను అన్నారు మోహన్ బాబు. స్వామివారి దగ్గర ఇలా జరగడం ఘోరం, మహా పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదే నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుతున్నాను అని మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.