Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

Ram Lingusamy Movie: 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో రామ్‌ వెంటనే 'రెడ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే 'ఇస్మార్ట్‌' వంటి భారీ విజయం తర్వాత వచ్చిన 'రెడ్‌' ఆ స్థాయిలో...

Ram Lingusamy: రామ్‌ - లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?
Ram Linguswamy
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 13, 2021 | 10:15 AM

Ram Lingusamy Movie: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో రామ్‌ వెంటనే ‘రెడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ‘ఇస్మార్ట్‌’ వంటి భారీ విజయం తర్వాత వచ్చిన ‘రెడ్‌’ ఆ స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మరో హిట్‌ను దక్కించుకోవాలనే కసితో ఉన్న రామ్‌.. తమిళ దర్శకుడు లింగు స్వామితో చేతులు కలిపారు. ఇటీవలే మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక ఇందులో రామ్‌ సరసన అందాల భామ కృతి శెట్టి నటిస్తుండడం మరో విశేషం. ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. వీటికి అనుగుణంగానే మేకర్స్‌ కూడా సినిమాలో భారీ తారాగణం ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Arya

‘ఉస్తాద్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తోన్న ఈ సినిమాలో రామ్‌ను ఢీకొట్టేలా విలన్‌ పాత్ర ఉండనుందని సమాచారం. ఇందుకోసం లింగు స్వామి తమిళ హీరోను దించే పనిలో పడ్డట్లు సమాచారం. ఇందులో విలన్‌ పాత్రలో ఆర్య నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆర్య కూడా ఇందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఆర్య ఇంతకు ముందు తెలుగులో వరుడు సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక సైజ్‌ జీరో సినిమాలో అనుష్క సరసన నటించారు. మరి ఆర్య మరోసారి విలన్‌గా నటించనున్నట్లు వస్తోన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. శ్రీనివాసా చిట్టూరి సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Manda Krishna: కత్తి మహేష్ మృతిపై సంచలన అనుమానాలు లేవనెత్తిన మందకృష్ణ మాదిగ

Tomato Price: టమాటా రేటు మళ్లీ ఢమాల్‌.. గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పారబోసి రైతులు

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్