Manobala: మనోబాల మృతికి ఆ అలవాటే కారణం!.. సంపాదించిన సొమ్మునంతా…

పదిహేడేళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టి పలు విభాగాల్లో పనిచేశారు. అదే సమయంలో కమల్ హాసన్ ప్రోత్సాహంతో 1979లో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన పుతియ వార్పుగల్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇప్పించాడు. అదే సినిమాలో ఆయన చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాతి ఏడాది భారతీ రాజా నిరమ్ మారంత పూకల్ సినిమాలో నటుడిగా మరో ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

Manobala: మనోబాల మృతికి ఆ అలవాటే కారణం!.. సంపాదించిన సొమ్మునంతా...
Manobala
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 11:37 AM

ప్రముఖ దర్శకుడు కమ్ కమెడియన్ మనోబాల మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే3న మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తంజావూర్ జిల్లా మరుంసూర్ కు చెందిన ఆయన 1953 డిసెంబర్ 8న జన్మించారు. ఆయన అసలు పేరు బాలచందర్. పదిహేడేళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టి పలు విభాగాల్లో పనిచేశారు. అదే సమయంలో కమల్ హాసన్ ప్రోత్సాహంతో 1979లో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన పుతియ వార్పుగల్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇప్పించాడు. అదే సినిమాలో ఆయన చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాతి ఏడాది భారతీ రాజా నిరమ్ మారంత పూకల్ సినిమాలో నటుడిగా మరో ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

1982లో ఆగయ గంగాయ్ అనే రోమ్ కామ్ సినిమా తెరకెక్కించారు. ఆసినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. దీంతో మళ్లీ నటుడిగా అవకాశాలు అందుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ కావాలనుకున్న ఆయన.. ఆ తర్వాత మూడేళ్లకు నాన్ ఉందల్ రసిగన్, పిల్లై నిలా అనే రెండు సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమాలే కాకుండా పలు సీరియల్స్ సైతం తెరకెక్కించారు మనోబాల. ఇప్పటివరకు ఆయన 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మనోబాల. అయితే ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోబాల మృతికి సిగరెట్స్ ఎక్కువగా తాగడమే అని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోబాల తనకున్న వ్యసనం గురించి బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా తాను ఒక్కరోజు దాదాపు 100 నుంచి 200 సిగరెట్స్ తాగుతానని.. దీంతో ఆయన కాలేయం దెబ్బతిందని చెప్పారు. ఇప్పటివరకు ఆయన సంపాదించినంత డబ్బంతా తన చికిత్స కోసమే ఉపయోగించానని.. సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతానని తనకు ముందే వైద్యులు చెప్పారని గతంలో తెలిపారు మనోబాల. జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురైన మనోబాల అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు.

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!