Prabhas: ప్రభాస్ పెళ్లితో తన మ్యారెజ్ ముడిపెట్టిన తమిళ్ హీరో.. డార్లింగ్ ఎప్పుడంటే అప్పుడేనట..

ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. మరో ఏడాది వరకు ఏడడుగులు నడిచే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే తాజాగా డార్లింగ్ పెళ్లికి తన మ్యారెజ్ ముడి పెట్టాడు తమిళ్ స్టార్ హీరో విశాల్.

Prabhas: ప్రభాస్ పెళ్లితో తన మ్యారెజ్ ముడిపెట్టిన తమిళ్ హీరో.. డార్లింగ్ ఎప్పుడంటే అప్పుడేనట..
Prabhas, Vishal
Follow us

|

Updated on: Dec 14, 2022 | 1:47 PM

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఠక్కున గుర్తొచ్చే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి కోసం.. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు.. అభిమానులు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ముందుగా బాహుబలి 2 తర్వాత మ్యారెజ్ చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలైన ఐదేళ్లు పూర్తైన..ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి మాట లేదు. ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. మరో ఏడాది వరకు ఏడడుగులు నడిచే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే తాజాగా డార్లింగ్ పెళ్లికి తన మ్యారెజ్ ముడి పెట్టాడు తమిళ్ స్టా్ర్ హీరో విశాల్.

తమిళ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విశాల్.. ఓ ఇంటర్యూలో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందులో పెళ్లేప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ మ్యారెజ్ చేసుకున్న రోజు నేను కూడా చేసుకుంటూ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అసలు పెళ్లి మాటే ఎత్తకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తో తన మ్యారెజ్ ముడి పెట్టడంతో ఇక విశాల్ పెళ్లి అయినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

విశాల్ పెళ్లి గురించి ఇటీవల అనేక రూమర్స్ వచ్చాయి. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కి చెందిన అనూష ఆళ్ల అనే అమ్మాయి విశాల్ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తడం లేదు విశాల్. ప్రస్తుతం ఈ హీరో వయసు 45. ఇటీవల విశాల్ పెళ్లి నటి అభినయతో జరుగుతుందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తెల్చీ చెప్పేశారు.

ఇవి కూడా చదవండి

విశాల్ గత నాలుగేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సమాధానం దాటవేస్తున్నాడు. 2019లో నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ.. ఆ బిల్డింగ్ మూడేళ్ల నుంచి నిర్మాణంలోనే ఉంది. ఇక ఇటీవల తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విశాల్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు .. అమ్మాయిని కూడా పరిచయం చేస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రభాస్ పెళ్లితో ముడి పెట్టేశాడు.