Shalini: అలాంటి భర్తను వదిలేయ్యడమే మంచిది.. విడాకుల ఫోటోషూట్ వెనుక చెప్పలేనంత నరకం..

ఇన్నాళ్లు తాను ఉన్న నరకం నుంచి విడుదలైనందుకు సంతోషంగా ఫీల్ అవుతూ.. అతడితో కలిసి ఉన్న ఫోటోలను చింపుతూ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొందరు షాలినికి సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం దారణంగా కామెంట్స్ చేశారు. తాజాగా విడాకుల ఫోటో షూట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది షాలిని.

Shalini: అలాంటి భర్తను వదిలేయ్యడమే మంచిది.. విడాకుల ఫోటోషూట్ వెనుక చెప్పలేనంత నరకం..
Shalini
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 4:40 PM

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. రెండు మనసులను కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో వివాహం మరో జన్మే. పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. వివాహం తర్వాత ప్రతి అమ్మాయి జీవితం సరిగ్గానే ఉంటుందనుకుంటే పొరపాటే. అయితే చాలా మంది మహిళలు భర్త వేధింపులకు గురవుతుంటారు. అతడిని వదిలేయాలనుకున్న సమాజం విమర్శలకు భయపడి జీవితాన్ని వెల్లదీస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భర్తతో మనస్పర్థలు వచ్చినా.. వేధింపులకు గురిచేసిన వెంటనే విడాకులు తీసుకుంటూ ఒంటరిగా జీవించేందుకు ముందుకు వస్తున్నారు మహిళలు. ఈ క్రమంలోనే బుల్లితెర నటి షాలిని ఒకడుగు ముందుకు వేసి విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. ఇన్నాళ్లు తాను ఉన్న నరకం నుంచి విడుదలైనందుకు సంతోషంగా ఫీల్ అవుతూ.. అతడితో కలిసి ఉన్న ఫోటోలను చింపుతూ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొందరు షాలినికి సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం దారణంగా కామెంట్స్ చేశారు. తాజాగా విడాకుల ఫోటో షూట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది షాలిని.

“దుబాయ్ లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్ లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే గొడవను పెద్దది చేయకుండా దాన్ని ఆపేందుకు ప్రయత్నించేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో తెలియకపోయేది. ఒక్క క్షణం పోలీసుల దగ్గరకు వెళ్దామా అనిపించినా.. మళ్లీ అతడి జీవితం నాశనం అవుతుందని నేను అడ్జస్ట్ అయ్యాను. రాత్రిళ్లు కొట్టినప్పుడు పార్కింగ్ లో పడుకునేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లదాకా అతడితో దెబ్బలు తిన్నాను. ఆన్ని సంవత్సరాలు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగి ఇవ్వాలనిపించింది. తిరగబడ్డాను. కొట్టాను. పాప కోసం ఆలోచించి అతడికి మర్యాద ఇచ్చాను. కానీ తన ముందే నన్ను కొట్టాడు. నా బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా తనముందే కొట్టడంతో వదిలేయాలనుకున్నాను. అలా విడాకులకు అప్లై చేసి తీసుకున్నాను ” అంటూ తాను భరించిన వేదన గురించి చెప్పుకొచ్చింది నటి షాలిని.

ఇవి కూడా చదవండి

అయితే విడాకుల ఫోటోషూట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది షాలిని. ప్రస్తుతం సమాజానికి భయపడి భర్తతో వేధింపులకు గురైన తనలాంటి మహిళలకు ఓ మెసేజ్ గా ఉపయోగపడాలని భావించినట్లు తెలిపింది.

View this post on Instagram

A post shared by shalini (@shalu2626)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.