Kushboo: చిరంజీవితో అలాంటి సినిమా చేయాడమే నా జీవితంలో పెద్ద కల… హీరోయిన్ ఖుష్బూ కామెంట్స్..

దాదాపు అందరితో కలిసి నటించిన ఆమె.. తన అభిమాన హీరో సరసన మాత్రం నటించలేకపోయింది. అతడితో కలిసి నటించే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి . వీరిద్దరు కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు. కానీ ఇందులో చిరుకు అక్కగా కనిపించింది ఖుష్బూ.

Kushboo: చిరంజీవితో అలాంటి సినిమా చేయాడమే నా జీవితంలో పెద్ద కల... హీరోయిన్ ఖుష్బూ కామెంట్స్..
Kushboo
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2023 | 5:32 PM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది ఖుష్బూ. అప్పట్లో ఆమె అందానికి.. అభినయంకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు. తమిళనాడులో ఏకంగా ఆమెకు గుడి కట్టారంటే అప్పట్లో ఖుష్బూ క్రేజ్ ఏ రెంజ్‏లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ స్టార్ హీరోలస సరసన నటించి మెప్పించింది ఖుష్బూ. దాదాపు అందరితో కలిసి నటించిన ఆమె.. తన అభిమాన హీరో సరసన మాత్రం నటించలేకపోయింది. అతడితో కలిసి నటించే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి . వీరిద్దరు కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు. కానీ ఇందులో చిరుకు అక్కగా కనిపించింది ఖుష్బూ.

ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఖుష్బూ.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు చిత్రాలలో కీలకపాత్రలలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె రామబాణం చిత్రంలో నటించింది. మ్యాచో స్టార్ గోపిచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. మే 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి రొమాన్స్ చేయాలని ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

“మెగాస్టార్ చిరంజీవి ఓ లెజెండ్. ఆయకు వర్క్ అంటే ఫ్యాషన్. ప్రతిరోజు సెట్స్ లో కొత్తగా కనిపిస్తారు. ప్రతి రోజు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలని ఆరాటపడుతుంటారు. నా జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవితో రొమాన్స్ చేయడం. కానీ ఇప్పటివరకు అది నెరవేరలేదు. స్టాలిన్ చిత్రంలో మేము కలిసి నటించాం. కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అది నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా. రామబాణం నిర్మాత నన్ను కలిశారు. చాలా బాగా మాట్లాడుతారు. ” అంటూ చెప్పుకొచ్చారు ఖుష్బూ.