Raj Kiran: “ఆ అమ్మాయి నా కూతురే కాదు..కానీ”.. అసలు విషయం చెప్పిన నటుడు
సీనియర్ నటుడు రాజ్‌కిరణ్(Raj Kiran)అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా మందికి తెలియకపోవచ్చు. విశాల్ నటించిన పందెంకోడి సినిమాలో ఆయన తండ్రిగా నటించి మెప్పించారు రాజ్‌కిరణ్.

సీనియర్ నటుడు రాజ్‌కిరణ్(Raj Kiran)అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా మందికి తెలియకపోవచ్చు. విశాల్ నటించిన పందెంకోడి సినిమాలో ఆయన తండ్రిగా నటించి మెప్పించారు రాజ్‌కిరణ్. తాజాగా ఆయన కూతురు బుల్లితెర నటుడు మునీష్‌రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గ మారింది. అయితే మునీష్‌రాజ్ ను పెళ్లి చేసుకున్న యువతి తన కూతురే కాదని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రకటన ఇచ్చారు. ఆ అమ్మాయి తన కూతురే కాదని నటుడు రాజ్‌కిరణ్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తన కూతురు ఓ టీవీ యాక్టర్ ను పెళ్లి చేసుకుందని తప్పుడు ప్రచారం జరుగుతుందని, రీసెంట్‌గానే ఈవిషయం తనకు తెలిసిందని అన్నారు.
నాకు ఉన్నది టిప్పుసుల్తాన్ అనే ఒక కొడుకు మాత్రమే..తాను హిందూ మతానికి చెందిన ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమెను సంతోష పెట్టడానికి దత్తత పిల్ల అని బయట ఎవరికీ చెప్పలేదని, సొంత కూతురుగానే పెంచుకున్నామన్నారు రాజ్‌కిరణ్. అయితే ఆ అమ్మాయిని మునీష్‌రాజ్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి మాయమాట చెప్పి పెళ్లి చేసుకునేంత వరకు తీసుకొచ్చాడన్నారు. ఈ విషయంతెలిసి అతడి గురించి విచారణ చేయగా అతను మోసగాడని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసిందన్నారు. అతను ప్రియను పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాలని కాకుండా తన పేరు వాడుకుని సినిమా ఛాన్స్ లు కొట్టేయాలని.. తన నుంచి డబ్బులు కాజేయాలని ఆమెను ప్రేమించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రియకు చెప్పి నచ్చచెప్పమన్నారు.అయితే కొన్ని నెలల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లిన ప్రియా ఆ తర్వాత ఇంటికి రాలేదని అన్నారు. అలాగే ఆమె ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం నా భార్యే అని నిందలు వేస్తుందని అందుకే మీడియా ముందుకు వచ్చి వివరించాల్సి వచ్చిందని అన్నారు రాజ్‌కిరణ్.







