CPI Narayana: చిరుకి, నాగ్ కు ఎంతో తేడా ఉందంటూ.. చిరంజీవిపై ప్రశంసల వర్షం.. నాగ్ పై తీవ్ర విమర్శలు చేసిన సీపీఐ నేత నారాయణ
తాను బిగ్ బాస్ షోని విమర్శిస్తే మహిళలను విమర్శించినట్టు కాదని నారాయణ స్పష్టం చేశారు. కోకో కోలా యాడ్‌లో నటించొద్దంటే చిరంజీవి వెంటనే ఆ యాడ్ నుంచి బయటకు వచ్చారని మరోసారి గుర్తు చేశారు.
CPI Narayana: బుల్లి తెరపై ప్రసారం అవుతున్న స్పెషల్ షో బిగ్ బాస్ పై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్ బాస్ పై మరోసారి తన అభిప్రాయాన్ని నారాయణ వ్యక్తం చేశారు. అంతేకాదు సినీ హీరో అక్కినేని నాగార్జునపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ.. నాగార్జునపై తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. తాను బిగ్ బాస్ షోని విమర్శిస్తే మహిళలను విమర్శించినట్టు కాదని నారాయణ స్పష్టం చేశారు. కోకో కోలా యాడ్‌లో నటించొద్దంటే చిరంజీవి వెంటనే ఆ యాడ్ నుంచి బయటకు వచ్చారని మరోసారి గుర్తు చేశారు. అయితే ఇదే విధంగా నాగార్జునకు బిగ్ బాస్ చేయొద్దని ఇప్పటికి అనేక సార్లు చెప్పానని.. అయినప్పటికీ నాగార్జున తన మాటలను పట్టించుకోకుండా డబ్బు కోసం కక్కుర్తి పడుతూ.. ఆ షో నిర్వహిస్తున్నాడంటూ నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు.
తనను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదని.. బిగ్‌బాస్ రియాల్టీ షో ఓ బ్రోతల్ హౌస్ అని తాను చేసిన కామెంట్స్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు నారాయణ స్పష్టం చేశారు. బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని .. మహిళలను కించపరిచినట్టు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు నారాయణ. తనకు కళాకారులపై తనకు గౌరవం ఉందని చెప్పారు. బిస్ బాస్ షో నిలిపివేయాలని తాను గొంతు వినిపిస్తూనే ఉంటానని చెప్పారు.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..