Ram Charan- Shankar : చరణ్- శంకర్ సినిమాలో జాయిన్ అయిన మరో విలక్షణ నటుడు
మెగా పవర్ స్టార్ రీసెంట్‌గా ఆర్ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించి ఆకట్టుకున్నారు చరణ్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)రీసెంట్‌గా ఆర్ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించి ఆకట్టుకున్నారు చరణ్. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో చరణ్ నెక్స్ట్ సినిమా పై భారీ ఎక్స్పెటెషన్స్ తో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టాప్ డైరెక్టర్ శంకర్ చెర్రీ నెక్ట్స్ సినిమాను రెడీ చేస్తున్నారు. ఓ ఇంట్రస్టింగ్ పొలిటికల్ డ్రామాతో చరణ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని టాక్. చరణ్, కియారా కలిసి గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా మరో స్టార్ నటుడు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలీ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఎస్ జే సూర్య ఇప్పటికే దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఇప్పుడు విలన్ గా మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక చరణ్ సినిమాలో సూర్య ఎలా కనిపించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా తమన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.




Versatile actor @iam_SJSuryah joins our stellar cast!
Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta
— Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022



