Dhanush: ధనుష్ బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. ‘సార్’‏లో ఇంట్రెస్టింగ్ పాత్రలో తమిళ్ స్టార్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 28, 2022 | 11:39 AM

అందులో ధనుష్ 'సార్' ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు

Dhanush: ధనుష్ బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. 'సార్'‏లో ఇంట్రెస్టింగ్ పాత్రలో తమిళ్ స్టార్..
Dhanush

Dhanush Birth Day: తమిళ్ స్టార్ ధనుష్ (Dhanush) నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం సార్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా జూలై 28న ధనుష్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ చేశారు మేకర్స్.

అందులో ధనుష్ ‘సార్’ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా,దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ ‘సార్’ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచారచిత్రం తో చిత్రం పట్ల పెరిగిన ఆసక్తి మరింత స్థాయికి వెళ్ళే దిశగా ధనుష్ పుట్టినరోజు నాడు అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల అయ్యే వీడియో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu