Tollywood : బరువు తగ్గేందుకు ఇంజెక్షన్స్ వాడుతున్న హీరోయిన్.. అసలు విషయం చెప్పేసిన ముద్దుగుమ్మ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త బ్యూటీలు రాణిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల గురించి తెలుసా.. తాజాగా ఓ హీరోయిన్ బరువు, శరీరాకృతి గురించి నెట్టింట రూమర్స్ చక్రర్లు కొడుతున్నాయి.

సాధారణంగా సినిమా ప్రపంచంలో నటిగా గుర్తింపు రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన హీరోయిన్స్.. అంతకు ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే హీరోయిన్ గా మెప్పించాలంటే ప్రతిభతోపాటు ఫిట్నెస్ సైతం ముఖ్యమే. ముఖ్యంగా తమ వెయిట్, ఫిట్నెస్, లుక్స్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్స్ కాస్త బరువు పెరిగినా జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. కానీ బరువు పెరగకుండా సంవత్సరాలుగా ఒక శరీరాకృతిలో కనిపించినప్పటికీ సదరు తారల గురించి గాసిప్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది. దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.
దీంతో బరువు తగ్గేందుకు ఒజెంపిక్ లాంటి ఇంజెక్షన్స్ వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది ఆ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తమన్నా. మిల్కీ బ్యూటీగా సౌత్ అడియన్స్ హృదయాలు దొచుకున్న హీరోయిన్. ఇప్పటికీ అనేక్ హిట్ చిత్రాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. తాజాగా తన వెయిట్ లాస్, ఫిట్నెస్ గురించి వస్తున్న ట్రోల్స్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
తమన్నా మాట్లాడుతూ.. “నేను 15 ఏళ్ల వయసు నుంచే నటిస్తున్నాను. కెమెరాతోనే నా ప్రయాణం సాగుతుంది. నేను దాచడానికి ఏం లేదు. టీనేజీలో స్లిమ్ గా ఉన్నాను. ఇప్పుడూ కూడా అలాగే ఉన్నాను అనుకుంటున్నాను. నా విషయంలో నాకేమి కొత్తగా అనిపించడం లేదు. సాధారణంగా మహిళ్లలో ప్రతి ఐదేళ్లకు మార్పులు చోటు చేసుకుంటాయి. కనుక ఎప్పుడూ ఒకే శరీరాకృతిలో కనిపించలేము” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




