Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి గుర్తుందా? ఆమె మనవరాలు కూడా తెలుగులో ఫేమస్ హీరోయిన్.. ఎవరంటే?
షావుకారు జానకి.. ఇప్పటి తరానికి ఈ దిగ్గజ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారీ అందాల తార. 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందలాది సినిమాల్లో నటించి లెక్కలేనన్నీ అవార్డులు సొంతం చేసుకున్నారు.

సుమారు 5 దశాబ్దాల సినీ ప్రస్థానం.. 400కు పైగా సినిమాలు.. లెక్కలేనన్నీ అవార్డులు, ప్రశంసలు.. ఇలా చెప్పుకుంటూ పోతే షావుకారు జానకి ఘనతలు అన్నీ ఇన్నీ కావు. 93 ఏళ్ల ఈ బామ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారంటే నటన పట్ల ఆమెకున్న మక్కువ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు జానకి. 1950లో వచ్చిన షావుకారు సినిమాతో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే తిరుగులేని నటిగా క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాలు చేశారు షావుకారు జానకి. తన అందం, అభినయంతో దాదాపు 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెప్పించారీ సీనియర్ నటీమణి. శుభాకాంక్షలు, బావగారూ బాగున్నారా?, దేవి, రావోయ్ చందమామ, ఎలా చెప్పను, అభిమన్యు, ఎవడే సుబ్రహ్మణ్యం, కంచె, సౌఖ్యం, బాబు బంగారం సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు జానకి. చివరిగా సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమాలో కనిపించారామె.
అయితే సినిమాల సంగతి తప్పితే షావుకారు జానకి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆమె మనవరాలు కూడా తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? పేరు వైష్ణవి. ఇలా పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ.. కల్ట్ క్లాసికల్ రోజా సినిమాలో హీరోయిన్ మధుబాల అక్క అంటే ఇట్టే గుర్తు పడతారు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ ప్రేమ సినిమాలోనూ హీరోయిన్ చెల్లెలు లీజ్జీ పాత్రలోనూ నటించింది వైష్ణవి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అత్తింట్లో అద్దె మొగుడు, చామంతి సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. అయ్యప్ప కరుణ, పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో మెరిసిన వైష్ణవి తెలుగులో కంటే తమిళం, మలయాళ భాషల్లోనే ఎక్కువగా సినిమాల్లో నటించింది.
రోజా సినిమాలో షావుకారు జానకి మనవరాలు..
View this post on Instagram
మనవరాలితో షావుకారు జానకి..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








