AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డకు అడ్డొస్తే అంతే ఇక.. కొత్త రూల్ తెచ్చిన బిగ్‏బాస్.. ఇమ్మూ ఫ్యాన్స్‏కు షాకే..

బిగ్‏బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో ఉన్నది ఇద్దరే అని గతవారం వీకెండ్ లో హౌస్మేట్స్ తేల్చేశారు. ఈసారి తనూజ, ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని.. ఇద్దరిలో ఒకరికి ట్రోఫీ రావడం ఖాయమని నాగార్జున ముందే చెప్పేశారు. దీంతో ఇప్పుడు కొత్త రూల్ స్టార్ట్ చేశాడు బిగ్‏బాస్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డకు అడ్డొస్తే అంతే ఇక.. కొత్త రూల్ తెచ్చిన బిగ్‏బాస్.. ఇమ్మూ ఫ్యాన్స్‏కు షాకే..
Emmanuel, Thanuja
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2025 | 7:22 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 9.. ఇప్పుడు పదో వారం నడుస్తోంది. మొదటి నుంచి పాజిటివిటీతోపాటు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే తనూజ, ఇమ్మాన్యుయేల్. ఇద్దరూ బిగ్‏బాస్ హౌస్ లోకి రావడానికి ముందే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి నాలుగైదు వారాల్లో స్నేహితులుగా తమ ఆట తీరుతో జనాలను కట్టిపడేశారు. కానీ ఇప్పుడు హౌస్ లో ఒకరికి ఒకరు పడడం లేదు. సపోర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని వాదిస్తున్నాడు ఇమ్మూ. ఒంటరిని చేశారంటోంది తనూజ. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ సైతం విడిపోయారు. అయితే తనూజను కావాలనే బిగ్‏బాస్ సపోర్ట్ చేస్తున్నారని.. ఆమె తప్పులను ఎక్కడా చూపించకుండా కాపాడుతున్నాడని.. ఈసారి ఆమెకు బిగ్‏బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్‏బాస్ తెచ్చిన కొత్తరూల్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

మరోవైపు మొదటి వారంలో నామినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.. ఆ తర్వాత నామినేషన్లలోకి రాలేదు. గత పది వారాలుగా నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నాడు. హౌస్మేట్స్ సైతం ఇమ్మూను నామినేట్ చేయడం లేదు. దీంతో అతడు నామినేషన్లలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఈసారి మరోసారి కెప్టెన్ కావడంతో అతడు సేఫ్ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ఝలక్ ఇచ్చాడు బిగ్‏బాస్.

Bigg Boss

Bigg Boss

పదవ వారం కెప్టెన్ తో సహా అందరిని నామినేట్ చేశాడు బిగ్‏బాస్. అయితే అన్ని సీజన్లలతో పోలిస్తే కెప్టెన్ సైతం నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి. ఈసారి కెప్టెన్ నామినేషన్ నుంచి సేవ్ కావాలా వద్దా అనేది మీ నిర్ణయం అంటూ తేల్చేశాడు బిగ్‏బాస్. దీంతో భరణి మినహా.. మిగిలిన హౌస్మేట్స్ అందరూ ఇమ్మూకు కెప్టెన్ కావడం వల్ల వచ్చే ఇమ్యూనిటీ దక్కాలని ఓటు వేయడంతో ఈవారం సైతం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. అయితే వరుసగా పది వారాలు నామినేషన్స్ లోకి రాకుండా సేవ్ అవుతున్న ఇమ్మూకు ఈవారం ఝలక్ ఇచ్చాడు. దీంతో బిగ్‏బాస్ కొత్త రూల్ ఏంటని ? .. కావాలనే ఇమ్మూను నెగిటివ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..