AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : మరోసారి అడ్డంగా దొరికిన రీతూ.. డీమాన్ కోసం దొంగాట.. ఇచ్చిపడేసిన సంజన..

బిగ్‌బాస్ సీజన్ 9 పదవ వారం నడుస్తోంది. ఈవారం కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా.. మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఎప్పటిలాగే బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనూజ సేఫ్ జోన్ లో ఉండగా.. నిఖిల్, గౌరవ్, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు. తాజాగా మంగళవారం విడుదలైన ప్రోమోలో.. డీమాన్ కోసం సంచాలక్ అయిన రీతూ దొంగాట స్టార్ట్ చేసింది.

Bigg Boss 9 Telugu : మరోసారి అడ్డంగా దొరికిన రీతూ.. డీమాన్ కోసం దొంగాట.. ఇచ్చిపడేసిన సంజన..
Bigg Boss 9 Telugu (9)
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2025 | 4:46 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఈవారం ఒక్కరు తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు వచ్చిన ఫస్ట్ ప్రోమోలో రాజులు, ప్రజలు , కమాండర్లు అంటూ కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. అందులో నిఖిల్, తనూజ, సంజన డీమాన్ నలుగురికి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్ మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజలలో ఒకరిని ఎంచుకుని వారితోటి పోరాడాల్సి ఉంటుందని చెప్పాడు. అంతకు ముందు వారంతా ఒక పరీక్షను ఎదుర్కోవాలని.. అందులో ఓడిపోయినవారు ప్రజలతో పోటీపడాల్సి ఉంటుందని.. కమాండర్స్ ముందుగా విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ టాస్కు ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగాగం బాస్కెట్లను కమాండర్స్ బ్యాగులుగా వెనకవైపు ధరించాలి. ట్రేలో ఉన్న బాల్స్ ను తీసుకుని ఇతర కమాండర్స్ బాస్కెట్లో వేయాలి. ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ .. ఎక్కువ బాల్స్ ఉన్నవారు గేమ్ నుంచి తప్పుకుంటారు.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

అయితే ఈ టాస్కుకు రీతూ సంచాలక్.. ఈ టాస్కులో ముందుగా డీమాన్ లైన్ టాటేశాడు. దీంతో తనూజ ఔట్ అని అరిచింది. కానీ సంచాలక్ రీతూ మాత్రం నువ్వు నెట్టావ్.. అంటూ డీమాన్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. లేదంటూ తనూజ వాదించినా వినలేదు. తర్వాత నిఖిల్, డీమాన్ ఇద్దరూ ఆడుతుండగా.. పవన్ మళ్లీ లైన్ దాటేశాడు. ఆప్పుడు కూడా రీతూ డీమాన్ కు సపోర్ట్ చేసింది. ఫస్ట్ వార్నింగ్ అని చెప్పింది. కాదు సెకండ్ వార్నింగ్ అని తనూజ చెప్పింది. మరోసారి నిఖిల్ లైన్ క్రాస్ చేయడంతో లేదు ఆడటానికి వీళ్లేదు అని ఆర్డర్ వేసింది. ఎందుకు ఆడటానికి వీళ్లేదు అంటూ తనూజ సీరియస్ కావడంతో రెండుసార్లు బయటకు వెళ్లాడు అని చెప్పింది రీతూ. మరీ పవన్ కూడా రెండుసార్లు వెళ్లాడు కదా అని తిరిగి క్వశ్చన్ చేయడంతో ఆడండి అంటూ మళ్లీ స్టార్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

రీతూ ప్రవర్తన చూసిన సంజన.. నువ్వు అతడిని ఎలిమినేట్ చేయాలి అంటూ అరిచింది. నేనేం చేయాలో నాకు చెప్పక్కర్లేదు. నాకు తెలుసు ఏం చేయాలో మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడమే ఉంది అంటూ రివర్స్ ఫైర్ అయ్యింది రీతూ. దీంతో ఇచ్చిపడేసింది సంజన. నీకు కావాల్సిన మనిషిని నువ్వు సేవ్ చేస్తున్నావ్ అని సంజన అనడంతో ఊర్లో అందరూ నాకు కావాల్సినవాళ్లే అంటూ బుకాయించింది రీతూ. దీంతో ఇద్దరి మధ్య వాదన మొదలైంది. నా స్ట్రాటజీ గురించి మాట్లాడటానికి నీకు ఏం హక్కు ఉంది అంటూ గట్టిగానే క్వశ్చన్ చేసింది సంజన. రీతూ బి ఫెయిర్.. ఫౌల్ చేస్తున్నావ్ అంటూ సంజన అనడంతో కావాలని పోట్రే చేయకండి అంటూ అరిచింది.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..