AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ నుంచి ‘స్వాగతాంజలి’ లిరికల్ సాంగ్ విడుదల..

తాజాగా విడుదలైన పాటలో కనిపిస్తోన్న సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన స్వాగతాంజలి పాట విన‌సొంపుగా ఉంది. చైత‌న్య ప్రసాద్ రాసిన ఈ పాటను శ్రీనిధి తిరుమ‌ల పాడారు. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది.

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ నుంచి ‘స్వాగతాంజలి’ లిరికల్ సాంగ్ విడుదల..
Kangana Ranaut
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2023 | 7:34 PM

Share

సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార జంటగా నటించిన చంద్రముఖి చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ‘చంద్రముఖి 2’ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఇటీవల కంగన రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా శుక‌వ్రారం ఈ సినిమా నుంచి ‘స్వాగ‌తాంజ‌లి…’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ అభరణాలను ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేస్తూ కనిపించింది.

తాజాగా విడుదలైన పాటలో కనిపిస్తోన్న సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన స్వాగతాంజలి పాట విన‌సొంపుగా ఉంది. చైత‌న్య ప్రసాద్ రాసిన ఈ పాటను శ్రీనిధి తిరుమ‌ల పాడారు. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది.

మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వినాయ‌క చ‌వితికి ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం స్వాగతాంజలి సాంగ్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.