AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్​ కెరీర్​ పాడవడానికి వారే కార‌ణ‌మ‌ట‌…!

బాలీవుడ్​ హీరో ​సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ సూసైడ్ ఫిల్మ్ వ‌ర్గాల్లో ఊహించ‌ని విషాదాన్ని నింపింది. కెరీర్ మంచి ఉచ్చ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో అత‌డు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

సుశాంత్​ కెరీర్​ పాడవడానికి వారే కార‌ణ‌మ‌ట‌...!
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2020 | 8:21 AM

Share

బాలీవుడ్​ హీరో ​సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ సూసైడ్ ఫిల్మ్ వ‌ర్గాల్లో ఊహించ‌ని విషాదాన్ని నింపింది. కెరీర్ మంచి ఉచ్చ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో అత‌డు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ లో నెపోటిజం కూడా అత‌డి మ‌ర‌ణానికి ఓ కార‌ణం అయ్యిండొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు  సెల‌బ్రిటీలు అదే నిజమంటూ వి‌మర్శ‌లు చేస్తున్నారు కూడా. ఈ క్ర‌మంలోనే ​ గత ఆరు నెలల్లో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఏడు సినిమాలను కోల్పోయాడని రాజకీయ నాయకుడు సంజయ్​ నిరుపమ్​ పేర్కొన్నారు. గతేడాది రిలీజైన ‘చిచోరే’ విజయం తర్వాత సుశాంత్​ ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని.. అయితే ఆరు నెలల స‌మ‌యంలోనే అవన్నీ అతడి నుంచి చేజారిపోయాయని తెలిపారు. అయితే ఆ చిత్రాలు ఏవి అన్న విషయాల‌పై మాత్రం ఆయ‌న‌​ క్లారిటీ ఇవ్వలేదు. ​ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క్రూరత్వం ఎక్కువ‌ని.. అదే సుశాంత్​ మరణానికి కారణమైందని నిరుప‌మ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

‘పవిత్ర రిష్టా’ అనే టీవీ సీరియల్​తో సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యారు. 2013లో రిలీజైన ‘కై పో చే’ బాలీవుడ్​లో అరంగేట్రం చేసి.. ‘ధోని: అన్​టోల్డ్​ స్టోరీ’, ‘సోంచిరియా’, ‘కేదార్​నాథ్​’, ‘డిటెక్టివ్​ బ్యోమకేశ్​ బక్షి’ సినిమాలతో నటుడిగా త‌న స్థాయిని పెంచుకున్నారు.

తాజాగా సుశాంత్​ మృతికి సంతాపం తెలిపిన బాలీవుడ్‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్.. పలు సంచలన కామెంట్స్ చేశారు. తన కెరీర్​ను సల్మాన్ ఖాన్‌‌, అతడి ఫ్యామిలీ మెంబ‌ర్స్ నాశనం చేశారని ఆరోపించారు.టాలెంట్​ మేనేజ్​మెంట్​ ఏజెన్సీ ప‌న్నే ప‌న్నాగాల‌ వల్ల కూడా టాలెంట్ ఉన్న‌ నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు అభినవ్​. సుశాంత్​ బలవన్మరణానికి కారణం అదే కారణమని తెలిపారు.