AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ‌కీల్ సాబ్ : ఏడు రోజులకు రూ.70 లక్షలు పారితోష‌కం కావాలంటోన్న శ్రుతి…!

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ 'వకీల్​ సాబ్' చిత్రంతో వెండితెర‌కు రీ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజకీయాల కోసం కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మైన ఆయ‌న‌..ఇటీవ‌ల మ‌ళ్లీ మేక‌ప్ వేసుకున్నారు.

వ‌కీల్ సాబ్ : ఏడు రోజులకు రూ.70 లక్షలు పారితోష‌కం కావాలంటోన్న శ్రుతి...!
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2020 | 6:49 AM

Share

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ ‘వకీల్​ సాబ్’ చిత్రంతో వెండితెర‌కు రీ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజకీయాల కోసం కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మైన ఆయ‌న‌..ఇటీవ‌ల మ‌ళ్లీ మేక‌ప్ వేసుకున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో చిత్ర షూటింగ్ మధ్య‌లోనే నిలిచిపోయింది. తాజాగా ప్ర‌భుత్వాలు షూటింగుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. వేణు శ్రీరామ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రకరణను త్వరలోనే రీ-స్టార్ట్ చేసేందుకు మూవీ యూనిట్ సమాలోచనలు చేస్తుందట. ఇప్పటికే ఈ ఫిల్మ్ 70 శాతానికి పైగా షూటింగ్​ను కంప్లీట్ చేసుకోగా.. పవన్​తోపాటు హీరోయిన్​పై కొన్ని సీన్ల‌ను తీయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్​ పాత్ర కోసం శ్రుతి హాసన్​ను సంప్రదించగా.. అందుకు ఆమె అధికంగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని సమాచారం.

కేవలం ఏడు రోజుల షూటింగ్​కు గానూ శ్రుతి.. ఏకంగా రూ.70 లక్షలను పారితోషకం​ అడిగినట్లు ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అంటే యావ‌రేజ్ గా గంట‌కు రూ. ల‌క్ష అనమాట‌. అయితే శ్రుతిని ఈ ప్రాజెక్టులో హీరోయిన్​గా ఖన్ఫామ్ చేస్తున్న‌ట్లు అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ రాలేదు. ‘వకీల్​ సాబ్​’లో హీరోయిన్​ పాత్ర కోసం గతంలో ఇలియానా, లావణ్య త్రిపాఠి, పూజా హెగ్డేలను పేర్లు కూడా ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి.

Follow Us