Suriya: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా.. ? ఆ హీరోతో కలిసి నటించాలని ఉందట..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల కోసం టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. హీరోయిజం, యాక్షన్ సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్న సినిమాలను ఎంచుకుంటూ.. సాహాసాలకు ముందుంటారు. ఇప్పుడు కంగువ సినిమాతో జనాల ముందుకు రాబోతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య సరసన బీటౌన్ బ్యూటీ దిశా పటానీ నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ తో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇక ఇందులో యానిమల్ విలన్ బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించగా.. ఆ వడేుకలో సూర్య, సందీప్ కిషన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో సూర్య మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో బయటపెట్టారు.
సూర్య మాట్లాడుతూ.. “నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ మంచి మిత్రులు. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా చేసింది డబ్బు కోసం కాదు. మీ అందరికీ గొప్ప సినిమా ఇవ్వాలనే నా ప్రయత్నం. నాకు ప్రభాస్‌ని కలవడం చాలా ఇష్టం. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలో బయటి నుంచి ఎవరూ సెట్‌కి కూడా వెళ్లలేదు. కానీ నేను వెళ్ళాను. ప్రభాస్ నాకు చాలా స్వీట్ ఫ్రెండ్. ఒకసారి నన్ను భోజనానికి పిలిచాడు.
ఆ రోజు ఇతర పనుల వల్ల చాలా ఆలస్యమైంది. దాదాపు 11:30 గంటలకు ప్రభాస్‌ని కలిశాను. అప్పటిదాకా వాళ్ళు కూడా తినకుండా నాకోసం ఎదురుచూశారు. ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాం. మళ్లీ ప్రభాస్‌తో డిన్నర్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాను” అన్నారు. అలాగే ‘ప్రభాస్‌తో యాక్షన్ సినిమాలో నటించేందుకు వెయిట్ చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.