Vettaiyan: ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న సూపర్ స్టార్ వెట్టయన్ సినిమా ఫస్ట్ రివ్యూ!
జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యలో లాల్ సలామ్ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు సూపర్ స్టార్. ఒరుతన్, జై భీమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ’వెట్టయన్’. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ విడుదలై కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యలో లాల్ సలామ్ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు సూపర్ స్టార్. ఒరుతన్, జై భీమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, తుషార విజయన్, రితికా సింగ్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అన్నవరం సినిమాలో పవన్ చెల్లెలు గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే
యాంటీ ఫేక్ ఎన్‌కౌంటర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే, విద్యా విధానానికి అనుకూలంగా అనేక సందేశాలను ఈ సినిమాలో చూపించనున్నారని టాక్. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వెట్టయన్లో రజనీకాంత్ ముస్లిం పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లాల్ సలామ్ చిత్రంలో రజనీ ముస్లింగా నటించడం గమనార్హం.
ఇది కూడా చదవండి :ఈ స్మైలింగ్ క్యూటీ రేంజే వేరు.. ఒక్క సినిమాకు రూ.12కోట్లు తీసుకుంటున్న స్టార్ ఆమె
ఈ సినిమా చివరి షూటింగ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో పూర్తయింది. ఈ షూటింగ్ లో రజనీకాంత్ పాల్గొని షూటింగ్ పూర్తి చేసుకుని హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. అనంతరం బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా పలు ప్రాంతాలను సందర్శించారు. ఇంతకుముందు మంజువారియర్, అభిరామి, దుషారా తర్వాత రితికా సింగ్ ఇంకా చాలా మంది డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు రజనీ కూలీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారని, ఖాళీ సమయంలో వెట్టయన్ కు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది. విడుదలకు సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ్‌గా ఎదిగిన అభిషేక్ మాట్లాడుతూ.. ‘వెట్టయన్ చాలా బాగా వచ్చింది. ఫకత్ తులసి వడివేలు లాగా డ్రాగ్ కామెడీ అదరగొట్టేశాడు. సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు’ అని అన్నారు. అయితే అభిషేక్ చెప్పిన దాంట్లో నిజం ఏంటో సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫస్ట్ రివ్యూ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.