Sivakarthikeyan : శివకార్తికేయన్ మూవీ టైటిల్‌ను లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్
తమిళ్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివ కార్తికేయన్ ఆతర్వాత యాంకర్ గా రాణించారు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు.
తమిళ్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan)వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివ కార్తికేయన్ ఆతర్వాత యాంకర్ గా రాణించారు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే డాన్ సినిమాతో వచ్చిన శివ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకుకూడా సుపరిచితుడే ఆయన నటించిన రెమో సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. అలాగే వరుణ్ డాక్టర్ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు శివ. శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో ఈ చిత్రానికి మహావీరుడు అనే టైటిల్ ను ఖరారు చేయగా , తెలుగు వెర్షన్ కు మహావీరుడు అనే టైటిల్ ను పెట్టారు. “శివకార్తికేయన్ మహావీరుడు టైటిల్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో మైండ్ బ్లోయింగ్ గా వుంది. శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా ..ఆయన అలా కట్లు తోనే విలన్స్ ని స్టయిలీష్ గా కొట్టడం చాలా డిఫరెంట్ గా వుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆలోచన చాలా కొత్తగా ఉండగా , క్యారికేచర్ స్టిల్ తో టైటిల్ రివీల్ కావడం మరింత రెఫ్రెషింగ్ గా వుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో శివకార్తికేయన్ అవుట్ స్టాండింగ్ గా కనిపించారు.
Happy to unveil the title of @Siva_Kartikeyan‘s #Maaveeran! Best wishes to the entire team!https://t.co/oU2aWLt0mE#Mahaveerudu @madonneashwin @ShanthiTalkies @iamarunviswa @bharathsankar12 @vidhu_ayyanna @philoedit
— Mahesh Babu (@urstrulyMahesh) July 15, 2022