Mahesh Babu : మేనల్లుడి కోసం మరోసారి రంగంలోకి సూపర్ స్టార్.. ఈ సారి ఇలా ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీనుంచి హీరోగా పరిచయం అయిన కుర్రాడు అశోక్ గల్లా. ఈ యంగ్ హీరో నటించిన హీరో సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahesh Babu : మేనల్లుడి కోసం మరోసారి రంగంలోకి సూపర్ స్టార్.. ఈ సారి ఇలా ..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 10, 2022 | 9:28 AM

Hero Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీనుంచి హీరోగా పరిచయం అయిన కుర్రాడు అశోక్ గల్లా. ఈ యంగ్ హీరో నటించిన హీరో సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటించింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ‘హీరో’ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా పండగ వేళ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమా విడుదల సమయంలో మేనల్లుడి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోషన్ చేశారు. హీరో సినిమా చూశానని సినిమా నచ్చిందని.. అశోక్ చాలా బాగా చేశాడని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మరోసారి మేనల్లుడి కోసం మహేష్ రంగంలోకి దిగాడు. హీరో సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. హీరో సినిమాలో ఈనెల 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హీరో సినిమా గురించి ప్రచారం మొదలు పెట్టారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వాహకులు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో సినిమా స్ట్రీమింగ్ గురించి ఓ వీడియో బైట్ ఇచ్చారు. మొన్న సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో హీరో నాకు నచ్చిన సినిమా. అతడిని చూస్తుంటే గర్వంగా ఉంది. అశోక్ ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు..ఇప్పుడు హీరో మీ ఇంటికి డైరెక్ట్ గా రాబోతున్నాడు. ఫిబ్రవరి 11న మీ ఫ్యామిలీతో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ మహేష్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bangarraju: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న బంగార్రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్‌లోనే అతిపెద్ద డీల్

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..