AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RajiniKanth Birthday: శివాజీరావు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు సినీ ప్రస్థానం.. తలైవా గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?..

కండక్టర్  స్థాయి నుంచి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్, తలైవాగా నిలిచిన రజినీ సినీ ప్రయాణం అంతా మాములుగా సాగలేదు. రజినీ సినిమాలు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డ్స్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇప్పటివరకు ఏ హీరో తీసుకుని పారితోషికం తీసుకోవడం సైతం ఆయనకే సాధ్యమైంది. ఇటీవల సెన్సెషన్ సృష్టించిన జైలర్ చిత్రానికి ఏకంగా రూ.200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు రజినీ. ఈరోజు తలైవా పుట్టిన రోజు

RajiniKanth Birthday: శివాజీరావు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వరకు సినీ ప్రస్థానం.. తలైవా గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2023 | 11:21 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన వాకింగ్ స్టైల్.. యాటిట్యూడ్ అంటే అభిమానులకు చాలా ఇష్టం. కండక్టర్  స్థాయి నుంచి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్, తలైవాగా నిలిచిన రజినీ సినీ ప్రయాణం అంతా మాములుగా సాగలేదు. రజినీ సినిమాలు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డ్స్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇప్పటివరకు ఏ హీరో తీసుకుని పారితోషికం తీసుకోవడం సైతం ఆయనకే సాధ్యమైంది. ఇటీవల సెన్సెషన్ సృష్టించిన జైలర్ చిత్రానికి ఏకంగా రూ.200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు రజినీ. ఈరోజు తలైవా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రజినీ గురించి ఇప్పటివరకు అభిమానులకు తెలియని విషయాలు తెలుసుకుందాం.

1. రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత డైరెక్టర్ బాలచందర్ ఆయనకు రజినీకాంత్ అని పేరు పెట్టారు. ఆయన తెరకెక్కించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో రజినీ పాత్రకు ఆ పేరు పెట్టినట్లు గతంలో తెలిపారు. సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా బాలచందర్ పై రజినీ ఉన్న గౌరవం ఏనాడు తగ్గలేదు.

2. రజనీకాంత్ మాతృభాష మరాఠీ. ఆయన తండ్రి రానోజీరా కర్ణాటక రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పోలీసు ఉద్యోగం పొంది కుటుంబంతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. అందుకే రజనీకాంత్ తన పాఠశాల విద్యను బెంగళూరులో గడిపారు. తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ, రజనీకాంత్ ఇప్పటివరకు మరాఠీ సినిమాలో నటించలేదు.

3. 16 ఏళ్ల వయసులో రామకృష్ణ మిషన్ స్కూల్‌లో చేరే వరకు రజనీకాంత్ చాలా అల్లరి చేసేవాడట. చిన్నవయసులో ఎన్నో అల్లరి పనులు చేసేవాడని.. . ‘మన్నన్’ సినిమాలో రజనీకాంత్, కౌందమణి లాగానే క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకోకుండా జంప్ అయ్యేవాడట.

4. రజనీకాంత్ చెన్నైలోని ఫిల్మ్ కాలేజీలో చేరడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేశారు. శివాజీ నగర్‌-సామ్‌రాజ్‌పేట రూట్‌లోని 134వ నెంబరు బస్సులో కండక్టర్‌గా పనిచేసే రజనీ.. ప్రయాణికులకు స్టైల్‌గా ”టిక్కెట్లు” ఇచ్చేవారట.

5. ఆ సమయంలోనే నటనపై ఆయనకు ఆసక్తి ఏర్పడింది. దీంతో ఆయన కన్నడలో పలు థియేటర్ షోలలో నటించారు. ప్రముఖ కన్నడ నటుడు గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించిన పలు నాటకాల్లో రజనీ నటించడం విశేషం.

6. ఆ రోజుల్లో రజనీ దగ్గర యాక్టింగ్ చదవడానికి సరిపడా డబ్బు లేదు. అయినా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే అతని కోరికకు తన స్నేహితుడు రాజ్ బహదూర్ తోడు నిలిచాడు. చెన్నై ఫిలిం కాలేజీలో చేరేందుకు అతను సాయం చేశాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం చెరిగిపోనిది.

7. చెన్నైలోని మిడ్‌ల్యాండ్ థియేటర్‌లో కె. బాలచందర్ దర్శకత్వంలో నగేష్ నటించిన “ఎత్తినీచల్” సినిమా చూసి ఎగ్జైట్ అయ్యారు. అదే సమయంలో కాలేజీ విద్యార్థులతో చర్చించేందుకు బాలచందర్ వస్తున్నారని తెలిసి.. ఆయనను కలుసుకున్నాడు. అప్పుడు రజినీ మాట్లాడుతూ.. ఒక నటుడి నుంచి నటన కాకుండా ఇంకా ఏమి ఆశిస్తున్నారు ? అని అడ్గగా.. నటుడు బయట నటించకూడదు అని బాలచందర్ సమాధానమిచ్చారట. ఇప్పటికీ ఆ మాటను ఫాలో అవుతున్నారు రజినీ.

8. ‘మూను ముడిచు’ సినిమాలో సిగరెట్‌ని పైకి లేపి అందుకునే సీన్ సినిమాలో హైలెట్ అయ్యింది. అప్పటి నుంచి రజినీ స్టైల్‏కు ఫిదా అయ్యారు. 1978 రజనీకాంత్‌కు మరపురాని సంవత్సరం అని చెప్పవచ్చు. ఆ ఏడాదిలోనే రజనీకాంత్ నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. ఉదయాన్నే బెంగుళూరు వెళ్లి ఓ సినిమాలో నటించి, సాయంత్రం చెన్నైకి తిరిగొచ్చిన రజనీకాంత్, మరో సినిమాలో నటించి, తర్వాతి ఫ్లైట్‌లో ముంబైకి వెళ్లి పగలు, రాత్రి నాన్‌స్టాప్‌గా నటించారు.

9. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న కలైపులి థాను తొలిసారిగా రజనీకాంత్‌కి ‘సూపర్ స్టార్’ బిరుదును ఇచ్చాడు. రజినీకాంత్ నటించిన భైరవి సినిమా విడుదల సమయంలో కలైపులి థాను ప్లాజా థియేటర్‌లో 35 అడుగుల ఎత్తైన రజనీ కటౌట్‌ను ఏర్పాటు చేశాడు. అప్పట్లో థియేటర్ ఎత్తుకు పైనే ఆ “కటౌట్” వేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో పాటు 3 రకాల పోస్టర్లను ముద్రించి చెన్నై నగరమంతా అతికించాడు. అప్పటి వరకు స్టైల్ కింగ్ అని పిలుచుకున్న రజనీకాంత్.. సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఆ పోస్టర్లలోనే ఉంది.

10. ‘తిండలే ఇనికుం’ సినిమాలో రజనీ సిగరెట్ విసిరి నోటితో పట్టుకునే స్టైల్ చాలా పాపులర్. అతని స్టైల్ చూసిన పూర్ణం విశ్వనాథన్ “ఇలా వరుసగా 10 సార్లు సిగరెట్ పట్టుకోగలవా? గెలిస్తే కారు ఇస్తాను” అని సవాల్ విసిరారు. 8 సార్లు నోటికి చిక్కిన రజనీకాంత్ చివరికి వెళ్లిపోయారు.