Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

సౌత్ ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్​ రాజమౌళి నెక్ట్స్ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సూపర్​స్టార్ మహేశ్​తో కలిసి పనిచేస్తారని గతంలోనే రాజమౌళి ప్రకటించారు.

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్
Mahesh Rajamoul Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2021 | 7:20 PM

సౌత్ ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్​ రాజమౌళి నెక్ట్స్ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సూపర్​స్టార్ మహేశ్​తో కలిసి పనిచేస్తానని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ మహేశ్ కూడా ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని చెప్పిన మహేశ్.. హిందీలో మూవీ చేయడానికి ఇదే సరైన సమయమన్నారు. తన తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నానని… ఇది అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ ప్రస్టేజియస్ ఫిల్మ్  ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఆ తర్వాత మహేశ్​-రాజమౌళి మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో​ ‘సర్కారు వారి పాట’ చేస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

కాగా రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతుందని వార్తలు వచ్చినప్పటి నుంచి పలానా కథతో, పలానా చోట తీస్తారు అంటూ పలు ఊహాగానాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా అడ్వెంచర్​ కథతో తెరకెక్కనుందని, ఆఫ్రికా అడవుల్లో తీస్తారని ప్రచారమూ గతంలో ఉంది. కానీ జక్కన్న మన దగ్గర కాకుండా విదేశీ నేపథ్య కథతో ఇప్పటివరకు సినిమా తీయలేదు. మరి మహేశ్​ చిత్రంతో ఆ ప్రయోగం చేస్తారేమో చూడాలి. అయితే ఈ కాంబోపై ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తోన్న సినీ అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుంది.  ‘ఆర్ఆర్ఆర్’ అనౌన్స్ చేసిన తర్వాత థియేటర్లలోకి రావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టనుంది. దీంతో మహేశ్​ సినిమా ఇంకెన్నాళ్లు పడుతుందో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Also Read: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండా అదేనన్న మంచు విష్ణు