Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ
Manchu Manoj Pawan
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2021 | 9:42 PM

టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన మనోజ్.. పవన్ కల్యాణ్‌తో కీలక అంశాలపై చర్చించారు. స్వతహాగా పవన్ కల్యాణ్ అంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే  మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది. కాగా ఇటీవల రిపబ్లిక్ ప్రి రిలీజ్ వేడుకలో మోహన్ బాబుపై పవన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ మోహన్ బాబును పవన్ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా సైలెంట్‌గా ఉంటే ఎలా అని క్వచ్చన్ చేశారు. పవన్ కామెంట్స్‌పై మోహన్ బాబు కూడా స్పందించారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల హడావిడిలో ఉన్నానని.. ఫలితాల అనంతరం తీరిగ్గా సమాధానం చెబుతా అన్నారు. అయితే ‘మా’ ఎన్నికల రోజున ఓటు వేయడానికి వెళ్లిన పవన్.. అటు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబును ఆప్యాయంగా పలుకరించారు. కాసేపు మాట్లాడుకున్నారు కూడా.

అయితే ‘మా’ ఎన్నికలు అటు మెగా ఫ్యామిలీకి, ఇటు మంచు ఫ్యామిలీకి అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎలక్షన్స్ రోజున అలాంటి సీన్ ఏమీ లేదని స్పష్టమయ్యింది. తాజాగా మనోజ్-పవన్ భేటీతో ఆ విషయంపై మరింత క్లారిటీ వచ్చింది. మరి వీరిద్దరి భేటీతో ‘మా’ అసోసియేషన్‌లో పరిణామాలు కుదటపడతాయో లేదో చూడాలి.

Also Read: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్