Mahesh Babu: మహేష్ బాబా మజాకా.. సూపర్ స్టార్ ‘పోకిరి’ సినిమాతో పాటు ఆ సినిమా కూడా అక్కడ స్పెషల్ షో వేయనున్నారట!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉంటారా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ముందువరసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు.

Mahesh Babu: మహేష్ బాబా మజాకా.. సూపర్ స్టార్ 'పోకిరి' సినిమాతో పాటు ఆ సినిమా కూడా అక్కడ స్పెషల్ షో వేయనున్నారట!!
Pokiri
Follow us

|

Updated on: Aug 08, 2022 | 6:18 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)గురించి ఆయన క్రేజ్ గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉంటారా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ముందువరసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. థియేటర్స్ అన్ని పెళ్లికూతురులా ముస్తాబవల్సిందే.. థియేటర్స్ ముందు జాతర జరగాల్సిందే. ఇక అదే ఆయన పుట్టిన రోజు అయితే అది ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. మహేష్ బాబు పుట్టిన  రోజు ఆగస్టు 9. అంటే రేపే.. మహేష్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాను షేక్ చేయాలనీ రెడీగా ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్లలో మహేష్ బాబు పోకిరి సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక టికెట్స్  బుకింగ్స్ ఓపెనైనా గంటల్లోనే క్లోజ్ అవ్వడం విశేషం.

ఇదిలా ఉంటే మహేష్ పోకిరి సినిమాను కేరళ రాష్ట్రంలో సైతం విడుదల చేయనున్నారు. మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేరళ లోని పలు థియేటర్స్ లో పోకిరి సినిమాను స్పెషల్ షోలు వేయనున్నారట. అంతే కాదు మహేష్ మరో బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమాను కూడా అక్కడ స్పెషల్ షో వేయనున్నారట. అలాగే టికెట్స్ భారీగా అమ్ముడుపోతుండటంతో మరికొన్ని షోలు పెంచే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఇక ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే మొత్తని చిల్డ్రన్ హాస్పటల్స్ కు, ఎంబీ ఫౌండేషన్ కు అందించనున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అటు రాజమౌళి దర్శకత్వలో కూడా మహేష్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు మూవీస్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..