AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIPSuperStarKrishnaGaru: మంచితనానికి మారు పేరు.. రికార్డుల రారాజు.. సూపర్ స్టార్ కృష్ణ

మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు..

RIPSuperStarKrishnaGaru: మంచితనానికి మారు పేరు.. రికార్డుల రారాజు.. సూపర్ స్టార్ కృష్ణ
Krishna
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2022 | 9:57 AM

Share

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇకలేరు. వెండితెర రారాజు మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్‌. నిన్న కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌ రామ్‌ గూడలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. కృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. టాలీవుడ్‌ దిగ్గజాలు కృష్ణ భౌతికకాయానికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. తెలుగు సినీ ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసిన కథానాయకుల్లో కృష్ణ అగ్రగణ్యుడు. వాదాలకీ వివాదాలకీ అతీతంగా సాగిన ధ్రువతార కృష్ణకి అశేష ప్రేక్షక లోకం మదినిండుగా నివాళులు అర్పిస్తోంది. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా గూఢచారి 116తో మెప్పించారు కృష్ణ. తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం సినిమాలతో ఔరా అనిపించారు. 340కిపైగా సినిమాల్లో అలరించారు కృష్ణ.

1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను స్థాపించారు కృష్ణ. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు సూపర్‌స్టార్‌. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు కృష్ణ. ఏడాదికి 19 చొప్పున 300 సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు చేసేవారు కృష్ణ. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలున్నాయి. 1997లో ఫిల్మ్‌ఫెయిర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు కృష్ణ. 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2000లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2009లో కృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించారు. 1989లో ఏలూరు నుంచి ఎంపీగా గెలుపొందారు కృష్ణ.

ఇవి కూడా చదవండి

నిర్మాత‌గానూ రాణించారు కృష్ణ. తెలుగులో మాత్రమే కాదు హిందీ, త‌మిళ, క‌న్నడ‌లోనూ ప‌ద్మాల‌య బ్యాన‌ర్ మీద ఎన్నో సినిమాలు తీశారు. హిందీలో హిమ్మత్‌వాలా, పాతాళ భైర‌వి, మ‌నాలి వంటి బ్లాక్‌బ‌స్టర్స్ ప‌ద్మాల‌య ఇమేజ్‌ని మ‌రింత పెంచాయి. స‌తీమ‌ణి విజ‌య నిర్మల ద‌ర్శకత్వంలో విజ‌య‌కృష్ణ బ్యాన‌ర్‌లో ఎన్నో సినిమాల‌కు స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించారు కృష్ణ. ఆయ‌న విజ‌యం వెనుక ఆయ‌న కుటుంబం స‌పోర్ట్ ఉంది. ఆయ‌న సోద‌రులు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావు ప‌ద్మాల‌య బ్యాన‌ర్ కోసం ఎంతో కృషి చేశారు.