Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి కారణమదే.. వెల్లండించిన కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు..

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇకలేరు. వెండితెర రారాజు మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్‌..

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి కారణమదే.. వెల్లండించిన కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు..
Superstar Krishna Deadbody
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 15, 2022 | 9:45 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇకలేరు. వెండితెర రారాజు మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్‌. సోమవారం నాడు కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు ప్రకటించారు.

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4:09కగంటలకు మృతి చెందారని కాంటినెంటల్ ఆస్పత్రి ప్రకటించింది. గుండెపోటుకు గురైన కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతి గంటకూ కుటుంబ సభ్యులతో చర్చిస్తూ వైద్యం అందించినట్లు వెల్లడించారు. కిడ్నీలు, గుండె, మెదడు డ్యామేజ్ సహా శరీరంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరైనట్లు తెలిపారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి 7గంటల సమయంలో ఆయనకు చికిత్స ఫలించదని నిర్ధారించామని చెప్పారు. అయితే, రాత్రి మళ్లీ పరిస్థితి విషమించగా చికిత్స అందించామన్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కృష్ణ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.

ప్రజల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌ రామ్‌ గూడలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. కృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. టాలీవుడ్‌ దిగ్గజాలు కృష్ణ భౌతికకాయానికి అశ్రునివాళి అర్పిస్తున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇక కృష్ణ మృతికి సంతాపంగా గురువారం నాడు చిత్ర పరిశ్రమలకు సెలవు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..