AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ విలన్‌తో క్రేజీ హీరోయిన్ ప్రేమాయణం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్..

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు భలే చిత్రంగా ఉంటాయి. ఇటీవలే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే మరికొంతమంది మాత్రం విడాకులతో షాక్ ఇస్తున్నారు. ఇక హీరో, హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్ పై రెగ్యులర్ గా ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

టాలీవుడ్ విలన్‌తో క్రేజీ హీరోయిన్ ప్రేమాయణం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2026 | 1:04 PM

Share

సినీ తారల ప్రేమలు, పెళ్లిళ్ల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాగే కొంతమంది సెలబ్రెటీల లవ్ ట్రాక్ గురించి ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఓ విలన్ , హీరోయిన్ ప్రేమాయణం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అతను ఓ విలన్, ఆమె ఓ క్రేజీ హీరోయిన్ ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రేమలో తేలిపోతున్నారు. ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్న విషయాన్నీ ఓపెన్ గానే ఒప్పుకున్నారు. దాంతో ఇద్దరూ కలిసున్న ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.? చాలా మంది హీరోలు విలన్స్ గా మారి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అదేంటో హీరోలుగా రాని ఇమేజ్ ను విలన్స్ గా సాదించుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు విలన్స్ గా క్లిక్ అయ్యారు. ఈ మధ్య హీరోల కంటే ఆ సినిమాల్లో నటించిన విలన్స్ కే క్రేజ్ పెరుగుతుంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న విలన్ ఒకరు. ఆ స్టైలిష్ విలన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు హీరోగా సూపర్ సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఆయనే వినయ్ రాయ్.

2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వినయ్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. నీవల్లే నీవల్లే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. వాన సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత తమిళ్ లోనే వరుసగా సినిమాలు చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు. వరుణ్‌ డాక్టర్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్నాడు వినయ్ రాయ్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఆమె మన టాలీవుడ్ హీరోయిన్. వినయ్ రాయ్ విమలా రామన్ తో డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ తెగ ఫోటోలు షేర్ చేస్తున్నారు.  టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో ఎవరైనా ఎప్పుడేనా, జగపతి బాబుతో ‘గాయం 2’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది. అలాగే నువ్వా నేనా సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో కనిపించింది. ఇదిలా ఉంటే విమలా రామన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రుద్రాంగి, గాండీవ దారి అర్జున సినిమాలో కనిపించింది. గాండీవ దారి అర్జున సినిమాలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్య భర్తలుగా నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
భారత సైన్యం, పారామిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ ఏజెంట్స్
భారత సైన్యం, పారామిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ ఏజెంట్స్
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!