Journey Movie: థియేటర్లలోకి మరోసారి శర్వానంద్ హిట్ మూవీ.. ‘జర్నీ’ రీరిలీజ్ ఎప్పుడంటే..
పాత చిత్రాలకు మళ్లీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మరిన్ని చిత్రాలను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే నితిన్, రాజమౌళి కాంబోలో వచ్చిన సై సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న డబ్బింగ్ చిత్రం త్రీ కూడా మరోసారి విడుదలయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు డబ్బింగ్ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నారు.
కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అందరు స్టార్ హీరోల పాత హిట్ సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు మరోసారి విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు మేకర్స్. పాత చిత్రాలకు మళ్లీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మరిన్ని చిత్రాలను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే నితిన్, రాజమౌళి కాంబోలో వచ్చిన సై సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న డబ్బింగ్ చిత్రం త్రీ కూడా మరోసారి విడుదలయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు డబ్బింగ్ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నారు.
తెలుగు అడియన్స్ ఎప్పటికీ మరచిపోలేని సినిమా జర్నీ. టాలీవుడ్ హీరో శర్వానంద్, అంజలి, జై, అనన్యలు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా తమిళంతోపాటు, తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ఎం శరవణన్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎంగేయుమ్ ఎప్పోతుమ్’ సినిమాను తెలుగులో జర్నీ పేరుతో రిలీజ్ చేశారు. దాదాపు 13 ఏళ్ల క్రితం థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సెప్టెంబర్ 21న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
రెండు ప్రేమ కథలనూ ఒక ప్రమాదంతో ముడిపెట్టి చూపించారు. అప్పట్లో తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ల్ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు డైరెక్టర్. ఈ సినిమాతో అటు అంజలి.. ఇటు శర్వానంద్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించాడు. జర్నీ సినిమా రీరిలీజ్ కాబోతుండగా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ షురూ అయ్యింది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా చిన్న నగరాల్లో, పట్టణాల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 4కే వెర్షన్ లో విడుదల చేయనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.