Suniel Shetty: షూటింగ్‏లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.. ఫ్యాన్స్ ఆందోళన..

బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టికి మంచి గుర్తింపు ఉంది. యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ఈ హీరో ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిత్రీకరణలో సునీల్ శెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Suniel Shetty: షూటింగ్‏లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.. ఫ్యాన్స్ ఆందోళన..
Suniel Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2024 | 8:10 PM

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ఆయన తన కొత్త సినిమా యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సునీల్ శెట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అతడి పక్కటెముకలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే షూటింగ్ సెట్ కు దగ్గరకు వచ్చిన డాక్టర్ సునీల్ శెట్టికి చికిత్స అందించారు. గాయం తీవ్రతను తెలుసుకోవడానికి షూటింగ్ లొకేషన్‌లోనే అతడికి ఎక్స్‌రే కూడా తీయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సునీల్ శెట్టి ‘హంటర్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ముంబైలోని సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈసిరీస్ లో ఓ ఫైట్ సీన్ కోసం చిత్రయూనిట్ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ ప్రమాదవశాత్తు సునీల్ శెట్టికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ శెట్టి వయసు 63 ఏళ్లు. తమ హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

నివేదికల ప్రకారం, వైద్యులు సునీల్ శెట్టికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కొన్ని రోజుల పాటు తన ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కు బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నారు. సునీల్ శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్నారు. గతంలో ‘ధారవి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇప్పుడు ‘హంటర్’ అనే వెబ్ సిరీస్‌లో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.