Michael Movie: మైఖేల్‌గా మారిన యంగ్ హీరో.. సందీప్ కిషన్ సినిమా నుంచి అందమైన మెలోడీ

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్. తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.

Michael Movie: మైఖేల్‌గా మారిన యంగ్ హీరో.. సందీప్ కిషన్ సినిమా నుంచి అందమైన మెలోడీ
Sandeep Kishan
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 28, 2022 | 9:17 PM

ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలను లైనప్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్. తన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు మైఖేల్ నిర్మాతలు బ్లాక్ బస్టర్ నోట్‌లో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్‌ ని విడుదల చేశారు.

ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో పక్కగా ఉండేలా కనిపిస్తోంది. హాంటింగ్ థీమ్‌ను కలిగివున్న ఈ పాటని సామ్ సిఎస్ చాలా వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట విన్న వెంటనే మనసుల్ని తాకుతోంది. తన మెస్మరైజ్ వాయిస్ తో లిరిక్స్ ని అద్భుతమైన రీతిలో ఆలపించాడు. భావోద్వేగాలని హృద్యంగా పలికించాడు. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అందించిన సాహిత్యం మనసుల్ని ఆకట్టుకుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటిది.

దివ్యాంశ కౌశిక్ తన ఇంటి గేటు తెరచి సందీప్‌కి రొమాంటిక్ సిగ్నల్స్ ఇవ్వడంతో పాట ప్రారంభమవుతుంది. అతను తికమకలో ఉన్నప్పుడే ఆమె అతన్ని ఆహ్వానించడం, ఆ తర్వాత వీరిద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి రావడం చాలా అందంగా గా ప్రజంట్ చేశారు. సందీప్, దివ్యాంశల అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కంపోజిషన్, వాయిస్ లానే విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.