AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur – Sumanth: మృణాల్ ఠాకూర్‏తో ప్రేమ, పెళ్లి.. సుమంత్ ఏమన్నారంటే..

సాధారణంగా హీరోహీరోయిన్స్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తుంటాయి. సెలబ్రెటీస్ ప్రేమ, పెళ్లి, డివోర్స్ ఇలా వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే.

Mrunal Thakur - Sumanth: మృణాల్ ఠాకూర్‏తో ప్రేమ, పెళ్లి.. సుమంత్ ఏమన్నారంటే..
Sumanth
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2025 | 8:21 AM

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టా్ర్ స్టేటస్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో ఈ బ్యూటీకి కెరీర్ టర్న్ అయ్యింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన మృణాల్.. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అలాగే అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల కొన్ని రోజులుగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. అదేంటంటే.. అక్కినేని హీరో సుమంత్ తో మృణాల్ ప్రేమలో ఉందని… త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతుందని ప్రచారం నడించింది. ఈ విషయంపై ఇద్దరూ మౌనంగా ఉండడంతో ఆ వార్తలు మరింత వినిపించాయి. తాజాగా ఈ విషయంపై హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన నటించిన అనగనగా సినిమా ఓటీటీలో మే 15న స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుమంత్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తనకు మృణాల్ తో ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుందని.. ఆ తర్వాత తనను ఎక్కడా కలిసింది కూడా లేదని అన్నారు. దీంతో సుమంత్, మృణాల్ పెళ్లి వస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. వీరిద్దరు కలిసి గతంలో సీతారామం చిత్రంలో నటించారు.

ఇవి కూడా చదవండి :  Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

తనకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేదని.. ఒంటరిగా ఉండడమే లైఫ్ బాగుందని.. కానీ తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ కాలేదని అన్నారు. జీవితంలో ఎప్పుడూ ఒక తోడు కావాలని అనిపించలేదని చెప్పుకొచ్చారు. సుమంత్ గతంలో హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..