Tollywood: ఈ ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌ వర్సటైల్‌ హీరో!! మీరనుకుంటున్న అతనైతే అసలు కాదు గురూ..

ఇందులో దగ్గుబాటి బ్రదర్స్‌ హీరో వెంకటేశ్‌, ప్రొడ్యూసర్‌ సురేశ్‌బాబులతో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో వర్సటైల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు అతను దగ్గుబాటి రానా కాదు. అలాగనీ అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ కూడా కాదు.

Tollywood: ఈ ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌ వర్సటైల్‌ హీరో!!  మీరనుకుంటున్న అతనైతే అసలు కాదు గురూ..
Tollywood
Follow us
Basha Shek

|

Updated on: Feb 09, 2023 | 8:17 AM

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలు ఇట్టే వైరల్‌ అయిపోతుంటాయి. హీరోల సినిమాలు రిలీజైనా, వారి పుట్టిన రోజులు వచ్చినా వారి చిన్న నాటి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఫై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో దగ్గుబాటి బ్రదర్స్‌ హీరో వెంకటేశ్‌, ప్రొడ్యూసర్‌ సురేశ్‌బాబులతో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో వర్సటైల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు అతను దగ్గుబాటి రానా కాదు. అలాగనీ అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ కూడా కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలైన ఓ బిగ్‌ ఫ్యామిలీ నుంచే వచ్చాడు. అందరిలా కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. అలాగే సాఫ్ట్‌రోల్స్‌కూ పేరు పొందాడు. అనతికాలంలోనే తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మావయ్య పేరును నిలబెడుతూ అమ్మాయిల మనసులు గెల్చుకున్నాడు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్సటైల్‌ హీరోగా దూసుకుపోతోన్న అతను మరెవరో కాదు అక్కినేని సుమంత్‌.

అక్కినేని నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ పుట్టిన రోజు ఇవాళ (ఫిబ్రవరి 9). అందుకే అతని చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ప్రేమకథతో టాలీవుడ్‌కు పరిచయమైన సుమంత్ యువకుడు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాత అక్కినేనితో కలిసి పెళ్లి సంబంధం అనే సినిమాలో నటించి మెప్పించాడు. అలాగే మావయ్య నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరాలో నటించాడు. ఆ తర్వాత సత్యం, గౌరీ, గోదావరి, క్లాస్‌మేట్స్‌, మధుమాసం, పౌరుడు, గోల్కోండ హైస్కూల్‌, మళ్లీరావా, సుబ్రహ్మణ్యపురం, మళ్లీ మొదలైంది సినిమాల్లో నటించాడు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూనే సీతారామం సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ అంటూ మాస్‌ పాత్రలో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..