మన దేశంలో మొదటి బడ్జెట్ను 1860లో జేమ్స్ విల్సన్ సమర్పించారు. రైల్వే ఆదాయం జీడీపీకి కీలకం కావడంతో బ్రిటిషర్లు 1924లో రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెట్టారు. 2017లో ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికి, రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేసింది. అరుణ్ జైట్లీ సంయుక్త బడ్జెట్ను సమర్పించారు.