Guna Sekhar: ఆ పాత్ర కోసం అల్లు అర్జున్ ఒక్క రూపాయ్ కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు..
దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి సినిమా నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను, విమర్శలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని, చరిత్రపై గౌరవంతోనే ఆయన నటించారని పేర్కొన్నారు.

దర్శకుడు గుణశేఖర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రుద్రమదేవి సినిమా నిర్మాణ సమయంలో ఎదుర్కున్న సవాళ్లపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాను భుజాలకెత్తుకున్నప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. గుణశేఖర్‌కు పిచ్చి పట్టింది, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు లాంటి మాటలు వినిపించినప్పటికీ, రుద్రమదేవి కథపై తనకు ఉన్న నమ్మకంతోనే ముందుకు వెళ్ళానని తెలిపారు. ఈ సినిమాను తానే సోల్ ప్రొడ్యూసర్‌గా నిర్మించానని, రిలీజ్ సమయానికి లాభం లేకపోయినా నష్టం రాలేదని, బ్రేక్ ఈవెన్ సాధించిందని వెల్లడించారు. రుద్రమదేవి కథ, అనుష్క, తమ అందరి శ్రమ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..
గోన గన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకోలేదని గుణశేఖర్ స్పష్టం చేశారు. రేసుగుర్రం విజయంతో ఉన్న అల్లు అర్జున్, కేవలం తనపై, చరిత్రపై ఉన్న గౌరవంతోనే ఈ పాత్రను చేశారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ మన సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తారని, ఆయన కుమార్తె అల్లు అర్హ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం దీనికి నిదర్శనమని.. శాకుంతలం షూటింగ్ సమయంలో గమనించిన విషయాన్ని పంచుకున్నారు. సినిమా దర్శకత్వం ఒక పెద్ద యజ్ఞం లాంటిదని, నిద్రలేని రాత్రులు, నిరంతర శ్రమ దీనిలో భాగమని గుణశేఖర్ వివరించారు. ప్రాజెక్ట్ సమయం ఎక్కువైనప్పుడు టీమ్ సభ్యులు మారడం సహజమని, చారిత్రక సినిమాలకు ఇది తప్పదని చెప్పారు. సమయపాలనకు తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని, కాల్ షీట్ సమయానికి అరగంట ముందే సెట్స్‌కు చేరుకుంటానని, ప్రతి షాట్ పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తానని వెల్లడించారు. యుఫోరియా లాంటి కథలు సమాజానికి అవసరమని, రుద్రమదేవి తమందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన కథ అని గుణశేఖర్ తెలిపారు.
ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




