Vijay Deverakonda: లైగర్ సినిమాతో పాన్ వరల్డ్ సౌండ్ ఇస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. డ్రైవర్ పుష్పరాజ్‌కి ఆలిండియా పర్మిట్ ఇచ్చి తానూ నేషనల్ రేంజ్ డైరెక్టర్‌గా ఎలివేట్ అయ్యారు సుకుమార్. మరి… వీళ్లిద్దరి కాంబో సంగతేంటి..? ఆ ప్రాజెక్ట్ మీద సౌత్ టు నార్త్ క్యూరియాసిటీ వుండదా చెప్పండి…? కానీ… ఈ క్రేజీ కాంబినేషన్‌కి లేటెస్ట్‌గా మరో బ్రేక్ పడిందట. అదేంటంటే రౌడీ హీరోని లైగర్‌స్టార్‌గా ట్రాన్స్‌ఫామ్ చేయడంతోనే ఆగిపోకుండా.. తనతోనే జనగణమన పాడించబోతున్నారు ఇస్మార్ట్ డైరెక్టర్. ఏప్రిల్‌లో షూటింగ్ కూడా షురూ కాబోతోంది. అలా పూరి మాస్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ఫుల్‌ఫిల్ చేశాక అర్జున్‌రెడ్డి ఏ గెటప్‌లోకి మారిపోతారు.. ఏ కెప్టెన్ కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తారు.. అనే ప్రశ్నలకు కొన్ని సర్‌ప్రైజింగ్ ఆన్సర్లు వినిపిస్తున్నాయి.
నేచురల్ కంటెంటున్న డైరెక్టర్‌గా రౌడీ హీరో మనసు దోచిన శివ నిర్వాణ.. రెండేళ్ల కిందటే ఒక సినిమాను పైనల్ చేసుకున్నారు. ఆ ప్రపోజల్‌కి ఇప్పుడిప్పుడే రెక్కలొస్తున్నాయట. విజయ్‌కి లవ్ ఇంట్రస్ట్‌గా సమంతను ఓకే చేశార్నది ఇప్పుడు నేషనల్ ఫిలిమ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. పూరి జనగణమన ఫినిష్ కాగానే సామ్ అండ్ విజయ్ కాంబో సెట్స్ మీదికొస్తుందటగా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నార్త్ ఆడియన్స్. లవ్ జానర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశానని ఒట్టేసుకున్న వరల్డ్‌ఫేమస్ లవర్ కోసం శివనిర్వాణ ఏ ఫ్లేవర్‌ని కుకప్ చేసిపెట్టారు అనేది మరో సస్పెన్స్. సరిగ్గా ఈ గ్యాప్‌లోనే సుక్కూ-విజయ్ కాంబోపై డౌట్లు పుట్టేశాయి. ట్వంటీ20 సెప్టెంబర్‌లో ఫాల్కన్ క్రియేషన్స్ కోసం ప్లాన్ చేసిన ఈ సినిమా మళ్లీ కోల్డ్‌స్టోరేజ్‌లోకి వెళ్లబోతోంది. ఈ ఆలస్యానికి ఓ రకంగా సుకుమారే కారణమట.
పుష్ప ప్రొడక్షన్ స్టేజ్‌లో వుండగానే కంటెంట్‌ని డివైడ్ చేసి..సెకండ్ చాప్టర్‌ని కొత్త ప్రాజెక్ట్‌గా టేకప్ చేశారు సుక్కూ. దీంతో ఆల్రెడీ కమిటైన సినిమాలు ఆటోమేటిగ్గా పక్కకు జరిగాయి. ఈలోగా రంగస్థలం కాంబోని రిపీట్ చేస్తూ చెర్రీతో మరో సినిమా లైన్లోకొచ్చింది. లెక్కల మేస్టారు ఇవన్నీ ఫినిష్ చేసేలోగా డియర్‌కామ్రేడ్ తన లైనప్‌ని రీడిజైన్ చేసుకుంటూ… ఇలా ప్లాన్‌బీ వైపు చూస్తున్నారన్నమాట.