ఓటీటీ ట్రెండ్ : సుక్కు కలం నుంచి సాలిడ్ ప్రేమ కథలు..
'రంగస్థలం' మూవీతో సుకుమార్ ఇండస్ట్రీ అదిరిపడే హిట్ ఇచ్చారు. మాస్ హిట్ అందుకుని..ఇండస్ట్రీలో తన సత్తా చాటారు.
‘రంగస్థలం’ మూవీతో సుకుమార్ ఇండస్ట్రీ అదిరిపడే హిట్ ఇచ్చారు. మాస్ హిట్ అందుకుని..ఇండస్ట్రీలో తన సత్తా చాటారు. ఒకానొక సందర్బంలో దర్శక ధీరుడు రాజమౌళి సైతం సుకుమార్ పక్కా మాస్ సినిమాలు తీస్తే రికార్డులు బద్దలవుతాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ ఇంపాక్ట్ ‘రంగస్థలం’ మూవీతో అభిమానులకు అర్థమైపోయింది. ప్రస్తుతం సుక్కు బన్నీతో ‘పుష్ప’ మూవీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఓ వైపు తాను దర్శకుడిగా సినిమాలు తీస్తూనే మరోవైపు తన శిష్యులకు కథలిస్తుంటారు సుకుమార్. కొన్నిసార్లు నిర్మాతగానూ మెరుస్తారు. అలానే ‘కుమారి 21 ఎఫ్’ తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు. తాజాగా సుకుమార్ మరోసారి ఆ తరహా ప్రయత్నం చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ… స్టోరీస్ సిద్ధం చేశాడట. త్వరలోనే ‘ఆహా’ ఓటీటీ యాప్ కోసం వాటిని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఓటీటీ కోసం సుకుమార్ తొమ్మిది ప్రేమకథలు సిద్ధం చేశాడని వినికిడి. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘మోడరన్ లవ్’ తరహాలో సుక్కు ప్రేమకథలు ఉంటాయని సమాచారం. ఓ ఇంటర్నేషనల్ నవల ఆధారంగా ఈ ప్రేమకథలు రాసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. సుక్కు టీమ్ ఇప్పటికే వాటిని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రెడీ చేశారట. అందులో ఓ రెండు స్టోరీలకు ఆయన దర్శకత్వం వహించనుండగా.. మిగిలిన వాటిని సుకుమార్ శిష్యులు, యువ దర్శకులు తెరకెక్కించనున్నారు. ‘పుష్ప ‘ షూటింగ్ మొదలయ్యేముందే ఈ వెబ్‌సిరీస్ పని కంప్లీట్ చేస్తారట. అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.