AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘శాక్రిఫైజింగ్ స్టార్’‌ సునిశిత్ అరెస్ట్‌

సునిశిత్‌ గుర్తున్నాడా..! కరోనా హాట్‌ టాపిక్‌గా మారక ముందు యూట్యూబ్‌లో ఇతగాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు వెళ్లాయని..

'శాక్రిఫైజింగ్ స్టార్'‌ సునిశిత్ అరెస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 6:10 PM

Share

సునిశిత్‌ గుర్తున్నాడా..! కరోనా హాట్‌ టాపిక్‌గా మారక ముందు యూట్యూబ్‌లో ఇతగాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు వెళ్లాయని.. ఎన్నో సినిమాలకు డైలాగ్‌లు రాశానని, పాటలు పాడానని, మా అసోసియేషన్‌కి పనిచేశానని, యాంకర్‌ ప్రదీప్ తన స్టోరీని కొట్టేశాడని.. ఒక్కటేమిటి, ఇలాంటివి చాలానే చెప్పుకొచ్చాడు. అంతేనా.. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానని, ఆ తరువాత విడిపోయామని మాట్లాడాడు. ఇక మిగిలిన హీరోయిన్లు కూడా తన లవర్లేనంటూ యూట్యూబ్‌లో తన వ్యాఖ్యలతో హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో ఇతగాడికి శాక్రిఫైజింగ్‌ స్టార్ అనే బిరుదును ఇచ్చారు నెటిజన్లు. ఇక మీమర్లు సునిశిత్‌పై ఏ రేంజ్‌లో మీమ్స్ చేశారు.

ఇదిలా ఉంటే సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు మరికొందరు కూడా సునిశిత్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇతగాడిపై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు, ఇబ్రహీంపట్నం కీసరలో ఒక కేసు నమోదైంది. వాటిని విచారిస్తోన్న పోలీసులు తాజాగా సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..