Julayi: జులాయి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? పాపం ఇప్పటికీ గురూజీ కోసం వెయిటింగ్..
జులాయి సినిమా ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగ్స్, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా జులాయి.త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలో నటించాడు బన్నీ. ఇక జులాయి సినిమా ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగ్స్, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే అల్లు అర్జున్ నటన, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలు చాలా ప్లస్ అయ్యాయి. అల్లు అర్జున్ కంటే ముందు ఈ సినిమాను మరో హీరోతో చేద్దామని అనుకున్నారట గురూజీ.
జూలై సినిమాలో బన్నీ కంటే ముందుగా తమిళ్ స్టార్ హీరో సూర్యతో చేద్దాం అనుకున్నారట త్రివిక్రమ్.. ఈ మేరకు ఆయనను సంప్రదించారట కూడా అయితే అప్పటికే నాలుగు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడట సూర్య. దాంతో త్రివిక్రమ్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట సూర్య.
అయితే అప్పటి నుంచి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు సూర్య. ఛాన్స్ దొరికితే గురూజీ దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నట్టు పలు ఇంటర్వ్యూల్లోనూ తెలిపారు సూర్య. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్.Surya