Raja Raja Chora: గంగవ్వ చెప్పిన ‘చోర గాథ’.. ‘రాజ రాజ చోర’ నుంచి సడెన్ సర్ఫ్రైజ్…
Chora Gaadha By Gangavva: యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం.. 'రాజ రాజ చోర'.
Chora Gaadha By Gangavva: యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం.. ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి.. ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది చిత్రయూనిట్. ‘చోర గాథ’ బై గంగవ్వ పేరుతో ఉన్న ఈ వీడియోలో.. ఓ రాజు, దొంగల మధ్య జరిగిన కథను ఓ చిన్నారికి గంగవ్వ చెబుతుంది. ముందుగా వీడియోలో.. నీకు ఊ.. కొట్టే కథ తెలుసా ? ఏది చెప్పిన ఊ..కొట్టాలి అని కథ మొదలు పెడుతుంది గంగవ్వ..
అనగనగా ఓ సూర్యుడి నుంచి భూమి.. అక్కడి నుంచి కోతి పుట్టిందని.. కోతి నుంచి మనిషి, బంగారం, పుట్టుకొచ్చాయంటూ గంగవ్వ చెప్పే కథ.. చాలా సరదాగా సాగుతుంది. కథకు తగ్గట్లుగా వచ్చే టూడీ యానిమేషన్.. ఆధ్యంతం ఆసక్తికరంగా కనిపిస్తుంది. చివరకు రాజు కిరీటాన్ని దొంగలించిన దొంగ.. దొరుకుతాడా లేదా అనే ప్రశ్నతోనే ముగుస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న రాజ రాజ చోర మూవీ టీజర్.. ఈ నెల 18 న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
వీడియో..