సౌత్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఛాన్స్ వస్తే తెలుగులో చేస్తానంటున్న సోనమ్..

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం బాలీవుడ్ బ్యూటీలకు అలవాటే! ... మొదట అవకాశం ఇస్తే వద్దంటారు... మా రేంజే వేరంటూ తెగ బిల్డప్‌ ఇస్తుంటారు..

సౌత్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఛాన్స్ వస్తే తెలుగులో చేస్తానంటున్న సోనమ్..

sonam kapoor : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం బాలీవుడ్ బ్యూటీలకు అలవాటే! … మొదట అవకాశం ఇస్తే వద్దంటారు… మా రేంజే వేరంటూ తెగ బిల్డప్‌ ఇస్తుంటారు.. ఎగిరెగిరి పడుతుంటారు. తీరా సిచ్యువేషన్స్‌ వారిని సైడ్ చేశాక.. సైలెంటగా మన వైపు చూస్తుంటారు. ఇంప్రెసివ్ కమెంట్లు చేస్తూ.. మన ఒళ్లో ఎప్పుడెప్పుడు వాలిపోదామని చూస్తుంటారు. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం అయిపోయిందనుకుంటా..! అవును అవకాశాల కోసం టాలీవుడ్ వైపు ఆశగా చూసే బీటౌన్‌ బ్యూటీల గురించే! ఇక దాదాపు బీటౌన్‌ బ్యూటీలందరూ ఫాలో అయ్యే ఈ థియరీని.. రీసెంట్ గా సోనమ్ కపూర్‌ కూడా అడాప్ట్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో తన బిల్డింగ్ బీటలు వారాక ఇప్పుడు.. సౌత్‌కు మకాం మార్చేద్దామని తెగ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే “ఐ లవ్ సౌత్‌ఇండియన్‌ ఫిల్మ్స్‌” అంటూ అడగకున్నా అందరికీ చెబుతున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ ఉన్నారంటూ.. ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టు చెబుతున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌లుగా పేరు తెచ్చుకుంటున్న తెలుగు హీరోల పక్కన అవకాశం వస్తే నటిస్తానంటూ.. క్యూట్ క్యూట్ గా చెప్పడానికి.. హీరోలను బుట్టలో వేసుకోడానికి తెగ ట్రై చేస్తున్నారు సోనమ్.

సావరియా టైంలో ఇదే డైరెక్టర్లు.. ఇదే హీరోల పక్కన యాక్ట్‌ చేయాలని కోరినా..లైట్ తీసుకున్న సోనమ్‌ ఇప్పుడు బీటౌన్‌లో తన దుకాణం మూత పడడంతో.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల వెనుక పడుతూ.. “ఒక్క పాన్‌ ఇండియ సినిమా ప్లీజ్‌” అంటూ కాకా పడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హవా చూపించలేకపోతున్న మీరు, పాన్ ఇండియా మూవీలో ఛాన్స్‌ ఎలా అడుగుతున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అంటూ… ఈ న్యూప్‌ ఫాలో అవుతున్న నెటిజన్లు సోషల్ మీడియాలో సోనమ్‌ను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

sarkaru vaari paata : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. త్వరలోనే సర్కారు వారి పాట అప్డేట్స్..

Varalaxmi Sarathkumar : బాలకృష్ణ సినిమాలో జయమ్మ.. వరలక్ష్మీ శరత్ కుమార్ ను రంగంలోకి దింపుతున్న గోపీచంద్ మలినేని..