Corona Effect: శరీరంలోకి ప్రవేశించిన కరోనాను అడ్డుకునేది ఆ జన్యువే.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
Corona Effect: దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచానికి ప్రశాంతత లేకుండా...
Corona Effect: దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచానికి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వేధిస్తున్నా సమాధానం మాత్రం దొరకడం లేదు. అన్నికంటే ముఖ్యంగా దీనిని నియంత్రించే మందు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు కరోనా మాత్రం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ ప్రజలపై రౌండ్ల మీద రౌండ్లు తన ప్రతాపాన్ని చూపుతోంది. అయితే, కరోనా వైరస్ బారిన పడిన వారిపై పరిశోధకలు చేసిన అధ్యయనం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కరోనా వైరస్ శరీరంలో ఏ విధంగా ప్రవర్తిస్తుంది? నిర్ధిష్ట కారణాలు ఏంటి? కొందరు వ్యక్తులు త్వరగా ఎలా కోలుకుంటున్నారు? మరికొందరిలో అసలే లక్షణాలు ఎందుకు ఉండటం లేదు? ఇంకొందరు కరోనాతో ఎందుకు చనిపోతున్నారు? వంటి అనేక గందరగోళ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఓ ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు గమనించినట్లు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తుల శరీరంలో కనిపించే నిర్దిష్ట జన్యువు (జన్యువు) కరోనాతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుందని అధ్యయనం కనుగొంది.
బ్రిటన్‌లోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం జరిపిన అధ్యయనంలో హెచ్‌ఎల్‌ఎ-డిఆర్‌బి 1*04:01 కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారి శరీరంలో మూడు రెట్లు ఎక్కువగా కనబడుతుందని, ఈ కారణంగానే కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని తేల్చింది. ఈ జన్యు మూలకం శరీరాన్ని కరోనా వైరస్ సంక్రమణ నుండి రక్షించగలదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కరోనా వైరస్ ద్వారా తీవ్రంగా ప్రభావితమైన, కరోనా నుంచి కోలుకున్న వారిపై పరిశోధన చేయడం ద్వారా దీనిని కనుగొన్నారు.
విశేషమేమిటంటే.. HLA-DRB1*04:01 సిర కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పర్యావరణానికి సంబంధించినది. ఐరోపాలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల ప్రజలలో ఇది ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. కరోనా వైరస్ బారిన పడిన ఉత్తర, పశ్చిమ ఐరోపా ప్రజలు ఎటువంటి లక్షణాలు లేకుండా నయం అయ్యే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనంలో భాగంగా టీకా కోసం కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, ప్రజలను ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించడం తదుపరి దశ అని డాక్టర్ కార్లోస్ పేర్కొ్న్నారు.
ALSO READ:
Viral Video: దుకాణదారుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలు మ్యాటర్ ఏంటంటే..