Viral Video: దుకాణదారుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Viral Video: మీరు మొబైల్ ఉపయోగిస్తున్నారా? మొబైల్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా? అయితే, వెంటనే ఈ వీడియోను చూసేయండి.

Viral Video: దుకాణదారుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Vrial Pic
Follow us

|

Updated on: Jun 12, 2021 | 5:38 AM

Viral Video: మీరు మొబైల్ ఉపయోగిస్తున్నారా? మొబైల్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా? అయితే, వెంటనే ఈ వీడియోను చూసేయండి. సోషల్ మీడియాలో వేలాది వినోదాత్మక వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటి ఇది. అయితే, ఈ వీడియోకు ఒక ప్రత్యేక ఉంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో జనజీవన అతలాకుతలం అయిపోయింది. ఉపాధి కరువైపోయింది. ఎందరో జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. అనేక మంది తమ ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ పరిస్థితి మరింద దుర్భరంగా తయారైంది. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ విధింపులో సడలింపులు ఇచ్చారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన షాపులు, మార్కెట్లు.. ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఆ ఆనందంలోనే ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేశాడు. ఆ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

ఈ వైరల్ వీడియోలో, ఓ బట్టల దుకాణదారుడు ‘రంగిలో మారో ధోలానా’ పాటకు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఇతర సహచరులు కూడా అతని నృత్యం చూసి ఆనందించారు. డ్యాన్స్ చేసిన దుకాణదారుడి వివరాలు తెలియరాలేదు. కానీ, అతని డ్యాన్స్ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. అతని డ్యాన్స్‌ని వేలాది మంది మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ‘భాయా హమ్ కాన్పురియా హైన్’ అనే ఖాతా నుండి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 9 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే, ఈ వీడియోను 25 వేల మంది లైక్ చేశారు.

దుకాణదారుడు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడంటే.. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోలోని దుకాణదారుడు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు? వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ ప్రకారం, లాక్డౌన్ తెరిచిన ఆనందంలో దుకాణదారులు డ్యాన్స్ చేస్తున్నట్లు తెలుస్తో్ంది. లాక్డౌన్ కారణంగా మూసివేసిన తన దుకాణం.. ఇప్పుడు తెరవడానికి అనుమతించటంతో సంతోషంలో మునిగిపోయాడు. ఆ నేపథ్యంలోనే షాపులో అతను డ్యాన్స్ చేశాడు.

లాక్‌డౌన్ ఎత్తివేయడంతో వ్యాపారులకు ఉపశమనం.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. ఫలితంగా, అవసరమైన సేవలు మినహా అన్ని దుకాణాలను రెండు, మూడు నెలల వరకు మూసివేశారు. కరోనా సెకండ్ వేవ్ చివరకు తగ్గడంతో లాక్డౌన్ పరిమితులు నెమ్మదిగా సడలించబడుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చునని ప్రభుత్వాలు ప్రకటించాయి. దాంతో చిరు వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగినట్లయ్యింది.

Viral Video:

Also read:

Weight Loss: బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ మూడు తాగండి.. ఫలితం చూసి షాక్ అవుతారు..!

Latest Articles