Thumb Duplication: రెండు బొటనవేళ్లు ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు.! వారికి పట్టిందల్లా బంగారమే.?
హిందూ ధర్మం ప్రకారం, ప్రతీ వ్యక్తి భవిష్యత్తు తన పుట్టుకతోనే నిర్ణయించబడుతుందని పండితులు చెబుతుంటారు. అయితే మన భవిష్యత్తు ఇంతే అని..
హిందూ ధర్మం ప్రకారం, ప్రతీ వ్యక్తి భవిష్యత్తు తన పుట్టుకతోనే నిర్ణయించబడుతుందని పండితులు చెబుతుంటారు. అయితే మన భవిష్యత్తు ఇంతే అని ఊరుకోకూడదు. మన కష్టమే.. మన తలరాతను కూడా మార్చేయగలదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే మన శరీరంలో ఏదైనా భిన్నంగా ఉంటే, అది మన భవిష్యత్తుతో అనుసంధానించబడిందని పండితులు అంటుంటారు. మరి మన చేతికి రెండు బొటన వేళ్లు ఉంటే, దాని అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు బొటన వేళ్లు అనగానే మొదటిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గుర్తొస్తాడు. రెండు బొటనవేళ్లు కలిగినవారి భవిష్యత్తు ఎలా ఉంది.? వారు తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారా.? మీకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తవచ్చు. వీటికి పెద్దలు భిన్నమైన సమాధానాలు చెబుతుంటారు. మరి అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు బొటనవేళ్లు ఉన్నవారి జీవితం ఎలా ఉంటుంది.?
రెండు బొటనవేళ్లు కలిగినవారి జీవితం ఎలప్పుడూ సంతోషంగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. వారు అదృష్టవంతులే కాకుండా.. తెలివైనవారు కూడా. అలాంటి వ్యక్తులు దగ్గర కావల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఉంటాయట. మహిళలకు రెండు బొటనవేళ్లు ఉంటే, దాన్ని వారు శుభంగా భావిస్తారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం, పనిలో నిబద్ధత, మంచి ప్రవర్తన కలిగి ఉంటారట.
సైన్స్ ఏమి చెబుతుంది?
రెండు బొటనవేళ్లు ఉన్నవారిని పాలిడాక్టిలీ అని పిలుస్తారు. kidshealth.org నివేదిక ప్రకారం , రెండు బొటనవేళ్లు పుట్టుకతోనే వస్తాయి. కొంతమందికి ఒక బొటనవేలు ఉంటే, మరికొందరికి రెండు బొటనవేళ్లు ఉంటాయి. బొటనవేళ్లలో ఒకటి పెద్దది మరొకటి చిన్నదిగా ఉంటుంది.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..